హరీశ్‌రావుకు పితృవియోగం.. సీఎం సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌ రావు తండ్రి సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని సీఎం రేవంత్‌ భగవంతుడిని ప్రార్థించారు. హరీష్‌ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరీష్‌ రావు తండ్రి మరణం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, హరీష్‌ రావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే సత్యనారాయణ మృతి పట్ల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క కూడా తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ హరీష్‌ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *