1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బి శివధర్‌రెడ్డి తెలంగాణ నూతన డీజీపీ గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు డీజీపీ కార్యాలయంలో శివధర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత మీడియా తో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పై స్వీయ నియంత్రణ అవసరమని హద్దులు దాటి వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.





