మంత్రి శ్రీధర్ బాబు
దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూసేలా…ప్రపంచంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్ గా నిలిచేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలో ‘భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ – 1 నిర్మాణాలకు శంఖుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..ఇప్పుడు ప్రణాళికాబద్ధమైన నగరం అనగానే అందరికీ చంఢీఘర్ గుర్తుకొస్తుంది. రాబోయే రోజుల్లో ప్రణాళికాబద్ధమైన నగరం అంటే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ గుర్తుకొస్తుందని పేర్కొంటూ
‘లివ్ – లెర్న్ – వర్క్ – ప్లే’ అనే కాన్సెప్ట్ తో పరిశ్రమలు, హాస్పిటల్స్ , పాఠశాలలు, షాపింగ్ మాల్స్ అన్ని ఒకే చోట ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నామన్నారు.
భావి తరాల కోసం, మన బిడ్డల కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం… ఈ రోజు మనందరం కలిసి వేస్తున్న పునాదే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ..ఇది ‘నెట్ జీరో కార్బన్ సిటీ’. ఇక్కడ పచ్చదనం ఉంటుంది, కాలుష్యం ఉండదు. పరిశ్రమలు వస్తాయి, కానీ పర్యావరణానికి ఎలాంటి హాని జరగదన్నారు. రేపటి తరాల కోసం… తెలంగాణ కోసం చిత్తశుద్ధితో నిరంతరం కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంతో కలిసి నడవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తమను ఆశీర్వదించాలని కోరుతూ . ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణంలో పాలు పంచుకుని… రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.





