కేబినేట్‌ ‌నిర్ణయం మేరకే కాళేశ్వరం

వ్యాప్కోస్‌ ‌సిఫారసుల ప్రకారమే నిర్మాణం
త్వరగా నిర్మించేందుకు కమిషన్‌ ఏర్పాటు
వ్యాప్కోస్‌ ‌సూచన మేరకు స్థల మార్పు
ప్రాజెక్టుపై అన్ని అంశాలతో కూడిన బుక్‌ అం‌దచేత
50 నిముషాల పాటు కెసిఆర్‌ను విచారించిన కమిషన్‌
ఓపెన్‌ ‌కోర్టు కాకుండా ఇండోర్‌లో విచారణ
కమిషన్‌ ‌ముందు సుదీర్ఘంగా వివరణ ఇచ్చిన మాజీ సీఎం కెసిఆర్‌

క్యాబినెట్‌, ‌ప్రభుత్వ ఆమోదంతోనే కాళేశ్వరం ఆనకట్టల నిర్మాణం జరిగిందని మాజీ కేసీఆర్‌ ‌జస్టిస్‌ ‌ఘోన్‌ ‌కమిషన్‌ ‌ముందు స్పష్టం చేశారు. వ్యాప్కోస్‌ ‌సిఫారసుల ప్రకారమే స్థల మార్పు చేసి, నిర్మాణం జరిగిందని.. అందుకు అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని కమిషన్‌కు అందజేశారు. బీఆర్కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్‌ ఎదుట మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌విచారణ ముగిసింది. ఆయన్ను పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌సుమారు 50 నిమిషాల పాటు విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. 115వ సాక్షిగా ఆయన్ను విచారించింది. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్‌ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్‌ ‌నుంచి కారులో బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట హరీశ్‌రావు ఉన్నారు.విచారణ సందర్భంగా కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్‌ 18 ‌ప్రశ్నలు అడిగింది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. ఈక్రమంలో కాళేశ్వరం రీఇంజినీరింగ్‌ ‌గురించి కేసీఆర్‌ ‌వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి క్యాబినెట్‌ ఆమోదం ఉందా అని కమిషన్‌ ‌ప్రశ్నించింది. కాళేశ్వరం కార్పొరేషన్‌ ‌గురించి కమిషన్‌ ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్‌ ‌తెలిపారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు- వివరించారు. బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి కేసీఆర్‌ను కమిషన్‌ అడిగింది. ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజినీర్లు చూసుకుంటారని కేసీఆర్‌ ‌చెప్పారు. బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతికపరమైన అంశమన్నారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. జీ.ఓ.నంబర్‌ 45‌ను, ఆపరేషన్స్ అం‌డ్‌ ‌మెయింటెనెన్స్ ‌బుక్‌ను కమిషన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కమిషన్‌కు కేసీఆర్‌ ‌పలు డాక్లుమెంట్లను అందించారు. మొదట దైవసాక్షిగా వాస్తవాలు చెబుతానని కేసీఆర్‌ ‌చేత ప్రమాణం చేయించిన కమిషన్‌ ‌చైర్మన్‌ ‌పీసీ ఘోష్‌. ‌మొత్తం 18 ప్రశ్నలను ఘోష్‌ అడిగారు. రీ ఇంజనీరింగ్‌, ‌కార్పొరేషన్‌ ఏర్పాటు, కేబినెట్‌ ఆమోదంపై కమిషన్‌ ‌ప్రశ్నలు వేసింది. రీ ఇంజనీరింగ్‌ ‌చేయడానికి ప్రధాన కారణాలను కేసీఆర్‌ ‌సుదీర్ఘంగా వివరించారు. ప్రతిదీ కేబినెట్‌ ఆమోదంతో జరిగిందని కేసీఆర్‌ ‌వివరణ ఇచ్చారు. కేబినెట్‌ ఆమోదంతోనే ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుందన్నారు. స్థల మార్పు నీటి లభ్యత, కాళేశ్వరం నిర్మాణంపై వ్యాప్కోస్‌ ‌నివేదిక ఇచ్చిందని కమిషన్‌కు చెప్పారు. లైఫ్‌ ‌లైన్‌ ‌కాళేశ్వరం పుస్తకాన్ని కమిషన్‌కు అందజేశారు. అందులో కాళేశ్వరం ఉద్దేశ్యాలను వివరించారు. నిధుల సకరణ కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని.. బ్యారేజీల్లో నీటి నిలువ అనేది ఇంజనీర్లు తీసుకునే నిర్ణయం తనకు సంబంధం లేదని కేసీఆర్‌ ‌వెల్లడించారు. బ్యారేజీల్లో నీటి నిల్వ కోసం రేమైనా ఆదేశాలు ఇచ్చారా అని కమిషన్‌ ‌ప్రశ్నించగా… తాను అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని.. బ్యారేజీలు నీటిని ఎత్తిపోయడానికి నిర్మించినవి అని కేసీఆర్‌ ‌సమాధానమిచ్చారు. ప్రాజెక్ట్ ‌లొకేషన్‌ ‌మార్పు నిర్ణయం ఎవరిది అంటూ కమిషన్‌ ‌మరో ప్రశ్న సంధించింది. లొకేషన్‌ ఎం‌దుకు మార్చాల్సి వచ్చిందో కేసీఆర్‌ ‌సుదీర్ఘంగా వివరించారు. సీడబ్ల్యూసీ తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పిందని.. వ్యాప్కోస్‌ ‌సర్వే చేసి నివేదిక ఇచ్చిందన్నారు. టెక్నికల్‌ ‌టీమ్‌ ‌మూడు బ్యారేజీలు నిర్మించాలని చెప్పిందన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదని చెప్పారు. టెక్నికల్‌ ‌టీమ్‌ ఇచ్చిన నివేదిక మేరకు లోకేషన్‌ ‌మార్పు జరిగిందన్నారు. నిర్ణయాలన్నీ కేబినెట్‌ ఆమోదంతోనే జరిగాయని కేసీఆర్‌ ‌చెప్పారు. విచారణ ముగిసిన తర్వాత బీఆర్కే భవన్‌ ‌ముందు కార్యకర్తలకు కెసిఆర్‌ అభివాదం చేశారు.  అనంతరం అక్కడ నుంచి కేసీఆర్‌ ‌వెళ్లిపోయారు. కాగా.. కాళేశ్వరం విచారణలో భాగంగా బుధవారం సిద్ధిపేటలోని ఫాంహౌస్‌ ‌నుంచి హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు కేసీఆర్‌ ‌చేరుకున్నారు. విచారణ నిమిత్తం లోపలికి వెళ్లిన కేసీఆర్‌ ‌తనకు జలుబు ఉందని కమిషన్‌కు చెప్పారు. ఈ క్రమంలో విచారణ విషయంలో కమిషన్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్‌ ఓపెన్‌ ‌కోర్టు విచారణను రద్దు చేసింది. కేసీఆర్‌ ఆనారోగ్యం కారణంగా బహిరంగ విచారణను రద్దు చేసిన కమిషన్‌.. ఇం‌డోర్‌లో ముఖాముఖిగా మాజీ సీఎంను విచారించారు. ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్‌ 114 ‌మందిని విచారించింది.  115వ సాక్షిగా ఆయన్ను విచారించింది. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్‌ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్‌ ‌నుంచి కారులో బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట హరీశ్‌రావు ఉన్నారు.
————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *