ఆయన అంతే…మా…మా..మాస్‌ ‌లీడర్‌

‌తండా వాసులతో కలిసి భోజనం
మంత్రి అని ఫీలింగ్‌ ‌లేని సాదా సీదా మంత్రి హరీష్‌రావు
లీడర్‌ అం‌టే గిట్ల ఉండాలె…మురిసిన తండా ప్రజలు
సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారిన తండా ప్రజలతో భోజనం ఫోటోలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: ఆయన అంతే…గరీబోళ్లు, తండా ప్రజలు…పల్లె ప్రజలు అగుపిస్తే చాలు ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. వారితో ఆత్మీయ ముచ్చట్లు పెట్టడం…బాగోగులు తెలుసుకోవడం… కలిసి ఛాయ్‌ ‌తాగడం…కుదిరితో వారితో కలిసే అక్కడే భోజనం చేయడం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఛాయ్‌ ‌తాగుతూనో, టిఫిన్‌ ‌చేస్తూనో, అన్నమో, రొట్టేనో తింటూనో వారి సమస్యలు తెలుసుకోవడం, వాటిని అప్పటికప్పుడు పష్కరించడమంటే ఆయన ఇంకా ఇంకా ఇష్టం. నాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు. నేడు స్వరాష్ట్రంలో కావచ్చు. ప్రజలతో మమేకం కావడమంటే ఆయనకు మహా ఇష్టం. పట్టరాని సంతోషం. ఈపాటికే మీకు ఆ లీడర్‌ ఎవరనేది అర్థమై ఉంటుంది. ఔనూ! మీరు ఊహించుకుంటున్నట్లుగానే ఆయనే మాస్‌ ‌లీడర్‌. ‌రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు. మునుగోడు ఉప ఎన్నికల వేళ…మంత్రి హరీష్‌రావు సాదాసీదాను చూసి అక్కడి ప్రజలందరూ మంత్రి అంటే గింత సింపుల్‌గా ఉంటారా..మాతో కలిసి అన్నం తింటారా..అని చర్చించుకుంటున్నారు. ఇప్పుడు సోషల్‌ ‌మీడియాలో ఇదే ట్రెండింగ్‌.


‌సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారిన తండా ప్రజలతో భోజనం ఫోటోలు…
నాటి తెలంగాణ ఉద్యమంలోనైనా..మొన్నటి హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలోనైనా…నేటి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలోనైనా ఎప్పుడైనా సరే. తండాలో నిద్ర పోవడం..తండా ప్రజలతోనే మమేకం కావడం పొలిటీషియన్లలో హరీష్‌రావు తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అంతే అభివృద్ధి నాయకుడిగా…మంత్రిగా హరీష్‌రావుది అదే స్టయిల్‌…‌సాదా సీదాగానే. మాస్‌ ‌లీడర్‌. అదే కదా నాయకునికి, సేవకునికి ఉండే నిబద్ధత. నేనో రాష్ట్రస్థాయి నాయకుడిని, మంత్రిని అని ఫీలింగు లేదు. నిరంతరం ప్రజల మధ్యనే, పేదల పక్షమే. ఎప్పుడూ తాను మంత్రిని అనే హంగూ, ఆర్భాటం ఎరగడు. సంక్షోభ సమయంలోనూ పార్టీ శ్రేణులను ముందుండి నడిపించేవాడు. జనాలకు ధైర్యాన్ని నూరిపోసేవాడే నిజమైన నాయకుడు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చేస్తున్నది సరిగ్గా ఇదే. ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ బై ఎలక్షన్‌ ‌ప్రచార వేళ… సిఎం కేసీఆర్‌ ‌నిలబెట్టిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకుని మంత్రి హరీష్‌రావు శ్రమిస్తున్నాడు. ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలోని ఓ తండాకు వెళ్లిన మంత్రి హరీష్‌రావు అక్కడివాళ్లు తీసుకువచ్చిన భోజనాన్ని వారితో కలిసి నేలపైనే కూర్చోని మంచి చెడులు మాట్లాడుకుంటూ భోజనం చేశారు. తండా వాసులు వండి తెచ్చిన భోజనాన్ని తింటూ భోజనం బాగుందని ప్రశంసించడంతో తండా వాసుల మనసును దోచుకున్నాడు. అయితే, ఓ తండాలో రాష్ట్ర మంత్రిగా ఉన్న హరీష్‌రావు సామాన్యుడిలా వచ్చి వారితో కలిసి భోజనం చేయడం అక్కడున్న ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. మంత్రి హరీష్‌రావు సింప్లీసిటీ చూసిన వారందరూ లీడర్‌ అం‌టే గిట్ల ఉండాలంటున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమనేది మంత్రి హరీష్‌రావును చూసే నేర్చుకోవాలని చెప్పడానికి ఈ ఫోటోలు చాలు. ఈ ఫోటోలే ఇప్పుడు సోషల్‌ ‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. హరీష్‌రావు సింప్లీసిటీపై నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. గిందుకే కదా మంత్రి హరీష్‌రావును అందరూ మాస్‌ ‌లీడర్‌ అనేది అని అందరూ అనుకుంటున్నారు.
….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *