మూడు విడతలుగా కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర

రాష్ట్రంలో మూడు విడతలుగా విజయభేరీ బస్సుయాత్ర ఉంటుందని రేవంత్‌ రెడ్డి అన్నారు. మొదటి విడుతలో మూడు రోజులు బస్సు యాత్ర దసరా తర్వాత రెండవ దశ బస్సు యాత్ర, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడవ దశ బస్సు యాత్ర ఉంటుందని ఆయన తెలిపారు.ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత బస్సు యాత్రలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారు.18న రామప్ప దేవాలయంలో శివుడికి పూజ చేసి బస్సు యాత్ర ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. అదే రోజు భూపాలపల్లి లో మహిళలతో సమావేశం, 19న రామగుండంలో సింగరేణి కార్మికులతో సమావేశం, పెద్దపల్లిలో పాదయాత్ర, సభ, కరీంనగర్‌ లో పాదయాత్ర , సభ20 న జగిత్యాల, బోధన్‌, నిజామాబాద్‌ లో పాదయాత్ర, సభలు ఉంటాయని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *