కాంగ్రెస్‌ ‌సునామీ రాబోతున్నది….

– తెలంగాణ ప్రజలు, సోనియాగాంధి కల నెరవేరనున్నది 

-కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ ‌లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడు.
– ఈ ప్రాజెక్టుతో రైతులకు ప్రయోజనం కలగలేదు.
– బీజేపీ, ఎంఐఎం, బీజేపీలు మూడు ఒక్కటే
– పెద్దపల్లి బహిరంగసభలో కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నేత రాహుల్‌ ‌గాంధీ.

మీ కలను ఈ పదేళ్లలో సీఎం కేసీఆర్‌ ‌నెరవేర్చలేదు. ఒక ముఖ్యమంత్రిగా గాకుండా రాజుగా వ్యవహరించాడు.. కాళేశ్వరం ప్రాజెక్టులో ధరలు పెంచి లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడు… భూములు లాక్కున్నారు. ముంచారు.. కానీ మీకేమి ప్రయోజనం కలగ లేదు.. బడా కాంట్రాక్టర్లకే జరిగింది.. ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్యన జరుగుతున్నాయి.. కాంగ్రెస్‌ ‌సునామీ రాబోతుంది.. తెలంగాణ ప్రజల కల నెరవేరనున్నది.. నిజమైన ప్రగతిని మేం చూపెడతాం.. తొలి రోజే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం.. బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటే.. అని కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. విజయభేరి యాత్రలో భాగంగా గురువారం కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధి భూపాలపల్లి జిల్లా మీదుగా పెద్దపల్లి జిల్లాలోకి అడుగు పెట్టారు. మంథని, లో రోడ్‌ ‌షో నిర్వహించి, సెంటినరీకాలనీలో సింగరేణి కార్మికులతో ముచ్చటించారు. అనంతరం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘ తెలంగాణ రావడంతో నాకు ఎంతో సంతోషం కలిగింది. తెలంగాణతో నాకు ఉన్న బంధం రాజకీయ బంధం కాదు. ప్రేమ, అభిమానం, అప్యాయత, కుటుంబ సంబంధం అని అన్నారు. ఈ అనుబంధం జవహర్లాల్‌ ‌నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ ‌గాంధీతో వచ్చింది. సోనియాగాంధీ తెలంగాణ ఇస్తామని ఇచ్చిన హామీ నాకు గుర్తుంది. తెలంగాణ ఇస్తే రాజకీయంగా నష్టం జరగవచ్చని వారి మనసులో ఉన్నప్పటికీ, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, నిరుద్యోగుల కోసం ఈ రాష్ట్రం ఇచ్చారని అన్నారు. పదేళ్ల తర్వాత సోనియాగాంధి కల, తెలంగాణ ప్రజల కలను ఈ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నెరవేర్చలేదన్నారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్నదని అన్నారు. ఒకవైపు సీఎం, ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ముఖ్య శాఖలన్నింటినీ తమ కంట్రోల్లో పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా గాకుండా రాజుగా పాలిస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందో అందరికి తెలుసరి, ధరలు పెంచి లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కింద రైతుల భూములను లాక్కోవడంతో పాటు బ్యారేజీల్లో భూములను ముంచారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చాయా?. మీకేమయినా లాభం జరిగిందా? అని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకే లాభం జరిగిందన్నారు. ధరణిని తీసుకవచ్చి, కంప్యూటరైజ్డ్ ‌చేస్తానని చెప్పి భూముల రికార్డులు మార్చి పేదల భూములు లాక్కున్నారని ఆరోపించారు. రెండు పడకల ఇళ్లు కట్టిస్తామని . చెప్పి ఇళ్లు కట్టించలేదన్నారు. లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని చెప్పి చేయలేదని, బడా రైతులకే రైతుబంధుతో లాభం చేకూరుతున్నదని అన్నారు. దళితులకు3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్‌, ఒక్కో వ్యక్తి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. సింగరేణి కార్మికులతో మాట్లాడానని, సింగరేణి గనులకు అదానికి కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తే అడ్డుపడ్డామని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణియే కాదు, దేశంలో ఉన్న గనులన్నింటినీ ప్రైవేట్‌ ‌పరం చేయకుండా రక్షణ కల్పిస్తామని, ఇతర సంస్థలను ప్రైవేటీకరించకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఆదానికి కట్టబెట్టిన బొగ్గు ధరలు ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు వేర్వేరు ధరలు నిర్ణయించి కట్టబెట్టడంలో ప్రధాని మోడీ సహకరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, అబ్జాలు చెప్పదని అన్నారు. కర్నాటక, ఛత్తీస్‌ ‌ఘడ్‌, ‌రాజస్తాన్లో లో చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, వారి ఖాతాల్లో 2 వేలు వేస్తున్నామని, రూ.. 500కే వంట గ్యాస్‌ ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళల ఖాతాల్లో 2500 జమ చేస్తామని, వంట గ్యాస్‌ ‌రూ.500కే ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. రైతుభరోసా కింద ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులకు 15 వేలు, ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామన్నారు. ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామని, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అం‌దిస్తామని, యువవికాసం కింద 5 లక్షలు ఇస్తామని, చేయూత కింద 4 వేలు ఇస్తామని అన్నారు. ఇది మా గ్యారంటీ అని, తొలి కేబినెట్లోనే అమలు చేయబోతున్నాని. నేనే మీకు మాట ఇస్తున్నానని అన్నారు. కర్నాటకలో ప్రతిపక్షాలు చేయలేరని విమర్శించాయని, కేసీఆర్‌ ‌పైసలు లేవని అంటారని అన్నారు. ఇక కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఉండదు. ప్రజల ప్రభుత్వం వస్తుంది. ఇన్నాళ్లు వారి జేబుల్లోకి వెళ్లిన పైసలు ప్రజల జేబుల్లోకి వస్తాయని అన్నారు. బీజేపీ, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని, బీజేపీ, ఎంఐఎంకు ఓట్లు వేస్తే బీఆర్‌ఎస్కు వేసినట్లేనని, లోక్సభలో జీఎస్టీ, రైతు నల్ల చట్టాలపై మద్దతు ఇచ్చారని, కేసీఆర్‌ ‌జూటా మాటలు నమ్మవద్దని అన్నారు. నా మీద 26 కేసులు ఉన్నాయని, ఎంపీ పదవిని రద్దు చేశారని, ఇంటిని లాక్కున్నారని, ఎందుకుంటే బీజేపీకి ఎదురొడ్డి పోరాటం చేయడమేనని అన్నారు. కేసీఆర్‌ అవినీతిని పాల్పడినా కూడా ఆయన మీద ఈడీ, ఐటీ కేసులు, సీఐడీ దాడులు విచారణలు ఉండవని అన్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్ను, ఢిల్లీలో బీజేపీని ఓడగొట్టాలని పిలపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌సునామీ రాబోతున్నది, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పదేళ్ల పాటు ఇబ్బందులు పడ్డారు. జెండా మోసిన పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, కేసులు పెట్టారని, ఇప్పుడు ఎవరికి భయపడవద్దని, వెనుకడుగు వేయకుండా పోరాటం చేయాలన్నారు. రాబోయేది తెలంగాణ ప్రజల ప్రభుత్వం అని అన్నారు. కొద్ది రోజుల క్రితం పార్లమెంట్లో ప్రధాని మోడీని ‘ఓబీసీ గురించి మాట్లాడతారు కులగణన చేయాలని ప్రశ్నిస్తే దాట వేశారని అన్నారు. భారత ప్రభుత్వం ఎంపీలతో నడవడం లేదని, 90 మంది అధికారులతో నడుస్తున్నదని, ఇందులో ఓబీసీ అధికారులు ముగ్గురేనని, వారికి చిన్న చిన్న శాఖలు అంటగట్టారని విమర్శించారు. 44.5 లక్షల కోట్ల బడ్జెట్ను ఎవరికి ఎంత పెట్టాలో నిర్ణయించేది ఆ 90 మంది అధికారులేనని, కానీ 5 శాతం బడ్జెట్‌ ‌మాత్రమే ఓబీసీలకు కేటాయిస్తున్నారని అన్నారు. చేస్తే, వారి శాతాన్ని బట్టి బడ్జెట్‌ ‌కేటాయింపులు చేయవచ్చన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్రంలో, తెలంగాణలోనూ కులగణన చేపడతామన్నారు. నిజమైన ప్రగతి మేం మొదలు పెడతామని అన్నారు. తెలంగాణలో చాలా తిరిగాను. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌సునామీ రాబోతుందని, ఈ నిజాన్ని అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు, తల్లులకు, తండ్రులకు చెప్పాలని, సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్రాన్ని లూటీ చేశాడని, మీ స్వప్నాన్ని కాంగ్రెస్‌ ‌నెరవేరుస్తామని చెప్పాలని రాహుల్‌ ‌గాంధి పిలుపునిచ్చారు.
తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌బిచ్చం ఎత్తుకునేవాళ్లు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి రాహుల్‌ ‌గాంధీ ఎవరు అని కేటీఆర్‌ అనే సన్నాసి మాట్లాడతాడు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్‌, ‌కేటీఆర్లు ఇద్దరు నాంపెల్లి దర్గా వద్ద బిర్లామందిర్‌ ‌మెట్ల మీద బిచ్చం ఎత్తుకునేటోళ్లని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. వీరికి లక్ష కోట్ల ఆస్తులు, 10 వేల ఎకరాల భూములు ఎక్కడివి అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏం చేసిందని మాట్లాడతారు. కాంగ్రెస్‌ ‌నాగార్జునసాగర్‌, ‌కోయిల్‌ ‌సాగర్‌, ‌నెట్టెంపాడు, జూరాల, శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టు, ఎన్నో ప్రాజెక్టులను కట్టిందని అన్నారు. హైటెక్‌ ‌సిటీని, ఔటర్‌ ‌రింగు రోడ్డును నిర్మించిందని, మైట్రో రైలును తీసుక వచ్చిందని, ఐటీని తీసుక వచ్చిందని, ఈ సన్నాసోళ్లు అసలు ఏం చేశారని ప్రశ్నించారు. ఈ దేశం కోసం త్యాగం చేసిన ఘనత గాంధి కుటుంబానిదని, ఈ దేశం కోసం నెహ్రూ పదేళ్ల పాటు జైలులో ఉన్నారని, ఇందిరాగాంధి ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించిందని, సమగ్రత, సమైక్యత కోసం, 18 ఏళ్లకే ఓటు హక్కు, కంప్యూటర్ను రాజీవ్‌ ‌గాంధీ తీసుక వచ్చారని అన్నారు. 25 ఏళ్లుగా సోనియాగాంది ఈ దేశం కోసం పాటు పడుతున్నదని, ప్రధాని, రాష్ట్రపతి పదవులను త్యాగం చేసిందని, పీవీ నర్సింహారావు, మన్మోహన్‌ ‌సింగ్ను ప్రధానులుగా, ప్రణబ్‌ ‌ముఖర్జీని రాష్ట్రపతి చేసిందన్నారు. రాహుల్గాంధీ ప్రధాని అయ్యే యోగాన్ని వదులుకున్నారని వివరించారు. కేటీఆర్‌ ‌రాహుల్గా గాంధి ఎడమ కాలి గోటికి కూడా సరిపోడని, అంతా బలుపు ఎందుకు, అమెరికాలో బాత్రూంలు కడిగిన సన్నాసి అని మండిపడ్డారు. పేపర్‌ ‌లీకేజీలకు పాల్పడి 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని విమర్శించారు. నియామక పరీక్షలు వాయిదా పడి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే, ఆమె చావుపై అంబండాలు మోపుతున్నారని అన్నారు. ఎస్సారెస్సీ ద్వారా లక్షలాది ఎకరాల్లో పంటలు పండితే, ఆ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. విజయరమణారావును 40 వేల మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును 30 వేల కోట్ల నుంచి లక్షా 25 వేల కోట్లకు తీసుక వెళ్లారని, ఆ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి చుక్క నీరు రావడం లేదన్నారు. ఎస్సారెస్సీ ద్వారానే ఈ ప్రాంతానికి నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఈ ప్రభుత్వం 5 లక్షల కోట్ల అప్పులు చేసిందని, సింగరేణి వనరులను రక్షిస్తామని అన్నారు. ఈ బహిరంగ సభలో పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్యం ఠాకూర్‌, ‌టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, మదు యాష్కీ గౌడ్‌, ‌దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు, విజయరమణారావు, డీసీసీ అధ్యక్షులు రాజ్‌ ‌ఠాకూర్‌ ‌మక్కాన్‌ ‌సింగ్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *