ఇరాన్ మీడియా ప్రకటన
టెహ్రాన్, జూన్ 23 : ఇజ్రాయిల్ చేపడుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 500 మంది మరణించినట్లు సోమవారం ఇరాన్ మీడియా ప్రకటించింది. జూన్ 13వ తేదీ నుంచి ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. మృతుల సంఖ్యపై సోమవారం ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. ఇజ్రాయిల్ నిర్వహించిన దాడుల్లో సుమారు మూడు వేల మంది గాయపడినట్లు ఇరాన్ స్టేట్ మీడియా తెలిపింది. అయితే అంతర్జాతీయ మీడియాపై ఇరాన్ ఆంక్షలు విధించడం వల్ల పలు మీడియా సంస్థలు ఆ దేశంలోకి వెళ్లలేకపోతున్నాయి. ఇజ్రాయిల్ దాడుల వల్ల ఇరాన్‌లో ఎంత నష్టం జరిగిందన్న దానిపై స్పష్టమైన అంచనా వేయడం వీలుకావడం లేదు. ఇరాన్‌లో పనిచేస్తున్న మానవ హక్కుల సంస్థ మాత్రం మృతుల సంఖ్య రెట్టింపుగా ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నది.