Day August 3, 2026

నిమ్స్ వైద్య బృందానికి సీఎం అభినందనలు

– రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంపై హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : హైదరాబాద్ నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించినందుకు నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్‌తోపాటు వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందానికి…

అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలి

– టి-ఫైబర్ పనులను గడువులోగా పూర్తి చేయాలి – అధికారులకు సీఎస్ సంజయ్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3: రాష్ట్రంలో మీ-సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ప్రపంచ బ్యాంకు…

రేప‌టినుంచి హైదరాబాద్‌లో ‘బ్రిక్స్’ ఏసీడబ్ల్యూజీ సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం(ఏసీడబ్ల్యూజీ) రెండో సమావేశానికీ, ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్‌వర్క్ రెండో సమావేశానికీ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిబ్బంది, శిక్షణ విభాగం(డీవోపీటీ) ఆతిథ్యమివ్వనుంది. బ్రిక్స్-2026కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈనెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ సమావేశాలు జరుగుతాయి. బ్రిక్స్…