– నవంబర్ 29కి అందుకనే అంతటి ప్రాధాన్యత
-కేసీఆర్ దీక్ష ఒక చరిత్రగా మిగిలిపోతుంది
-సిద్దిపేటలో ఉద్యోగుల గర్జన మరోచరిత్ర
– మాజీ మంత్రి హరీష్‌రావు
నవంబర 29అంటే ఒక చరిత్ర, ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజిది. ఉద్యమానికి సిద్దిపేట కు అవినాభావ సంబంధం వుందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రం పొన్నాలలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్ష దివస్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. సిద్దిపేటలో జరిగిన ఉద్యోగుల గర్జన, కెసిఆర్ ఆమరణ దీక్ష చరిత్రగా మిగిలిపోతాయన్నారు. ఎన్నో త్యాగాల పలితంగా ఈ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. తెలంగాణ వచ్చేదాకా నా ప్రాణం పోదని నాకు దైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్ . నేను సచిపోను ఒకవేళ చస్తే నా శవం పై తెలంగాణ జెండా పెట్టాలని కెసిఆర్ అన్నారని గుర్తుచేశారు. పిసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నేడు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ప్రణబ్ ముఖర్జీ తాను వ్రాసిన ఆత్మకత పుస్తకం లో కేసీఆర్ కోసం ఒక పేజీ కేటాయించారు. డిసెంబర్ 9ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితమేనని స్పష్టం చేశారు. దీక్ష చేసింది బిఆర్ఎస్ నాయకులు అయితే కక్షలు కాంగ్రెస్ వాళ్ళవన్నారు. మిలియన్ మార్చ్ మా వంతు మిలియన్ ల కొద్ది డబ్బులు మూటలు కట్టి డిల్లీకి పంపుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డికి కోదండ రామ్ దగ్గర అయ్యాడన్నారు. మన నిధులు, మన నీళ్లు మనకు దక్కేలా చేసింది కేసీఆర్. కృష్ణానది నీళ్ల పంపకం పై ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా ట్రిబ్యునల్ ముందు మూడు రోజులుగా వాదిస్తున్నది. ఉత్తం కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కి చీము నెత్తురు లేకుండా మాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర మూడు కోట్ల ఆత్మగౌరవాన్ని కించపరచాలని చూడకండని హితవు పలికారు. రాష్ట్రం రావడం వల్లనే తెలంగాణ పచ్చని మాగాణి గా మారి పంటలు పండుతున్నాయని గుర్తుచేశారు. గ్లోబల్ సమ్మిట్ పెట్టి భూములు అమ్ముకునేందుకు రేవంత్ రెడ్డి చూస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ చరిత్ర ఉంటుంది. ఈ సందర్భంగా అమర వీరుల కుటుంబాలను ఆయనతో పాటు కొత్త ప్రభాకర్‌రెడ్డి సన్మానించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన ముగ్గురు ఉద్యమ నాయకులు చనిపోయారు. అవునూరు సత్తయ్య తెలంగాణ ఉద్యమ సమయం లో చనిపోయారు.. కెసిఆర్ ప్రభుత్వం లో వారి కుమారుడు సందీప్ కు విద్యాశాఖ లో ఉద్యోగం ఇచ్చారు. అదేవిదంగా అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ చనిపోయారు అతని తమ్ముడు శ్రీదర్ కు వెటర్నరీ శాఖ లో ఉద్యోగం ఇచ్చారు, అదేవిధంగా కన్నబోయిన ఐలయ్య ఉద్యమ సమయం లో తెలంగాణ కోసం పోరాడుతూ ఇక తెలంగాణ రాదు, ఈ కాంగ్రెస్ ఇవ్వదు అనే ఆవేదన తో చనిపోగా ఆయన నర్సిములు కు ఉద్యోగం ఇచ్చారన్నారు. దీక్షా దివస్ సందర్బంగా వారి త్యాగలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎం ఎల్ సి లు దేశపతి శ్రీనివాస్ యాదవ రెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన ఉద్యమ కారుడు అందెశ్రీ కి నాయకులు నివాళులు అర్పించారు.





