సీనియర్ జర్నలిస్ట్ సీ హెచ్  ఎమ్ వీ కృష్ణా రావు(బాబాయి) ఇక లేరు

సీనియర్ జర్నలిస్ట్ సీ హెచ్  ఎమ్ వీ కృష్ణా రావు(బాబాయి) ఈ రోజు ఉదయం మృతి చెందారు. సంవత్సర కాలంగా క్యాన్సర్ వ్యాధి కి చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.47 సం. లుగా జర్నలిజం వృత్తి లో ఆయన వివాద రహితుడిగా ప్రశంసలు అందుకున్నారు.

సీ ఎమ్ కెసీఆర్ సంతాపం

సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని సిఎం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని సిఎం అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,  వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని సిఎం కేసీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *