వాతావరణ శాఖ వెల్లడి
ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాలకు ఐఎండీ అలర్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 29 : తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. మధ్య భారతదేశంతోపాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉన్నదని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేడు గురువారం రోజున దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
మంగళవారం నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో అత్యధికంగా 5.1 సెం.విూ.లు, నిజామాబాద్ నార్త్‌లో 4.35 సెం.విూ.లు, నిజామాబాద్‌లో 3.93 సెం.విూ.లు, నిజాంపేటలో 3.58 సెం.విూ.లు, కల్దుర్తి, గోపన్‌పల్లిలలో 3.45 సెం.విూ.లు, చిన్నమావంధిలో 3.15 సెం.విూ.ల వర్షపాతం నమోదైంది. దక్షిణ అండమాన్ మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిరది. పశ్చిమ ` వాయువ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం నాటికి నైరుతి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాముంది.




