మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ

కేంద్ర కమిటీ సభ్యుడు ఏసేబు అలియాస్ జగన్ మృతి

మృతి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 04 : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరో అగ్ర నాయకుడు మృతి చెందాడు.

ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ తరహాలోనే మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ దాదా రణదేవ్ దాదా.. కేంద్ర కమిటీ సభ్యుడు, కేంద్ర మిలిటరీ ఇన్చార్జ్, మహారాష్ట్ర చత్తీస్ ఘడ్ బార్డర్ ఇంచార్జ్ మృతిచెందినట్టు దంతేవాడ పోలీసులు ధ్రువీకరించారు.

కాగా మరణించిన అగ్రనేత స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందినట్లు దంతేవాడ ఎస్పి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *