“హక్కులపై అధికార పక్షాలను ప్రశ్నించి, నిలదీసినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. అంతేకానీ పాలకవర్గాల భ్రమల్లో ఉంటై ప్రతిపక్షాలను ప్రశ్నిస్తే ప్రయోజనం శూన్యం, వెరసి బీసీలను మరింత అన్యాయం జరుగుతుందన్నది గ్రహించాలి. సోకాల్డ్ బీసీ నేతల ప్రచారం వెనుక,ప్రకటనల వెనుక ఖచ్చింతగా బీసీ ప్రయోజనాలైతే లేవు..ఎవరి ప్రయోజనాలున్నాయో బీసీలు తెలుసుకోవాలి. బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తున్న కొంతమంది బీసీ నాయకుల వెనుక ఎవరి ఎజెండా ఉందో బీసీలు గ్రహించాలి.”
రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాగానే మరోసారి బీసీ రిజర్వేషన్ల ఇష్యూను కాంగ్రెస్ పార్టీ తన అనుయాయులతో తెర పైకి తీసుకు వచ్చింది. కొంతమంది బీసీ నేతలను ముందుపెట్టి బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలు, రేవంత్ రెడ్డి అండ్ అతని సహచర మంత్రుల కుంభకోణాలు, అవినీతిపై బీఆర్ఎస్ పోరాటం చేస్తు ప్రజలను చైతన్యం చేస్తుంటే, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ అండ్ కో చేస్తుంది. ప్రతిపక్ష నేతలపై, రాష్ట్రంలో ఒక సామాజిక వర్గంపై అవాకు చెవాకులు పేలుతున్నారు. ప్రజలు, ప్రతిపక్షం దృష్టిని మున్సిపల్ ఎన్నికల నుంచి డైవర్ట్ చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అది బీఆర్ఎస్ అనకూలంగా మార్చుకుంది. ఇలా రేవంత్ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌న్నీ విఫలం అవుతోన్నాయి.
ఒకవైపు కుల పాలిటిక్స్ చేస్తూ వోట్ల పోలరైజేషన్ రాజకీయాలు చేస్తునే మరోవైపు తెరపైకి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ అనుకూల వర్గాలు తీసుకువచ్చారు. బీసీలను మోస్తూ, బీసీలతోనే బీసీల కన్నుపోడిపించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. ఎన్నికలకు ఎన్నికలకు సిట్‌లు విచారణలు, కమిషన్లు తీసుకువచ్చినట్లే, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సీఎం బ్యాచ్ తీసుకువస్తుంది.
తాజాగా మున్సిపల్ ఎన్నికల వేళ మరోసారి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ అండ్ టీం తెరపైకి తెచ్చింది. రెండు నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి అంశాలనే తీసుకువచ్చింది. కొంతమంది బీసీ నాయకులను ముందుపెట్టి బీసీ వోట్లను కాంగ్రెస్‌కు పోలరైజేషన్ చేసే ప్రయత్నం అప్పుడు చేసింది, ఇప్పుడు చేస్తుంది. సదరు బీసీ నేతలు నిజంగా జాతి హక్కుల కోసం పని చేస్తున్నారంటే వారి పోరాటం నేతి బీరలో నెయ్యిలాంటింది..వినిపిస్తుంది కానీ కనిపించదు..బీసీల రిజర్వేషన్ల కోసం కోట్లాడటం లేదు. బీసీ నేతల్లో ఉండే కొంతమంది అవకాశవాదులుగా మారిపోయారు. రాజకీయార్దిక ప్రయోజనాల కోసం బీసీల గొంతుకోస్తున్నారు. ప్రభుత్వాల పంచన చేరి బీసీలను మోసం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షం ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చిందని, అతను గతంలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారనే ప్రచారం చేస్తున్నారు..గాంధీ భవన్ నుంచి వచ్చిన ఆదేశాలతో బీఆర్ఎస్ బీసీ వ్యతిరేకి అనే ప్రాపగండాను చేస్తున్నారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి దొంగ మాటలు, చెల్లని జీఓలు, న్యాయ స్థానంలో నిలవని ఆర్డినెన్సులను ,బిల్లులు తీసుకువచ్చి బీసీలను నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సోకాల్డ్ బీసీ ఉద్యమకారులకు గొప్పదైంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే బిల్లులు సరిగ్గా చేసేది, చట్టాలు, ఆర్డినెన్సులు న్యాయ స్థానంలో నిలిచేలా చేసేది.
కానీ కాంగ్రెస్ అలా చేయకుండా బీసీలను రిజర్వేషన్ల భ్రమల్లో ముంచింది. 42% బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దగ్గర క్లారిటీ లేదని, స్పష్టలేని అస్పష్టమైన బిల్లులు, ఆర్డినెన్సులను తీసుకువచ్చి బీసీలను నమ్మించి గొంతు కోస్తుందని, బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా జరగాలని ఓ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కోర్టులో కేసు వేస్తే, ఇప్పుడు అతనికి బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓ బీఆర్ఎస్ బీసీలను మోసం చేస్తుందని గాంధీ భవన్ బీసీ మేధావులు బయటకు వచ్చి విమర్శలు చేస్తు గగ్గోలు పెడుతున్నారు. వ్యక్తిగా దేశ పౌరుడిగా తన సామాజిక వర్గానికి నష్టం జరుగుతుందన్నప్పుడు కోర్ట్కు వెళ్లడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు.ఆ హక్కును ప్రశ్నించే హక్కు ఎవ్వరికి లేదు.
అసలు రాష్ట్రంలో బీసీలను మోసం చేస్తుందు ఎవరు.?. బీఆర్ఎస్ స్సా.?.కాంగ్రెస్ ప్రభుత్వం మా.?.లేదా బీజేపీ కాంగ్రెస్ పార్టీలా.? కాంగ్రెస్.. బీజేపీలు పార్టీలు రెండూ బీసీలను మోసం చేస్తుంది వాస్తవం కాదా.?.లేదా బీసీ ముసుగులో బీసీలనే మోసం చేస్తున్న బీసీ నాయకులా.?..ఆర్డినెన్సులు, బిల్లులు, జీఓ ల విషయంలో కాంగ్రెస్ బీజేపీ బీసీలను మోసం చేస్తు, దొంగ డ్రామాలు ఆడటం లేదా.?.
బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ఎవరిని అడగాలి.?. ప్రతిపక్ష పార్టీలనా.?.అధికారంలో ఉన్న కాంగ్రెస్ , బీజేపీ పార్టీలనా.?. చట్టాలు చేయాల్సిన, అమలు చేయాల్సిన అధికార పార్టీలను వదిలేసి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని అడగటం అంటే కాంగ్రెస్, బీజేపీ లకు అంటగాగటమే కాదు, అజ్ఞానం అవుతుంది..ఎన్నికలప్పుడే సోకాల్డ్ బీసీ మేధావులకు రిజర్వేషన్లు గుర్తుకు వస్తుందా.?.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లపై మోసం చేసింది. ఎన్నికలు ముగిసిన నెలలు గడుస్తుంది ఇన్ని రోజులు బీసీ మేధావులు ఎందుకు మౌనంగా ఉన్నారు.?. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే సరికి మళ్ళీ బీసీ మేధావులు నిద్రలేచారా.?.ఇన్నీ రోజులు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని మోస్తున్న కాంగ్రెస్ గాంధీ భవన్ బీసీ మేధావులు రెండేళ్ల క్రితం బీసీ రిజర్వేషన్లపై సరైన బిల్లు, తీసుకువస్తే ఎవరైనా ఎందుకు కోర్టు కు పోతారు.?.కాంగ్రెస్ చేసిన బిల్లు చట్టబద్దంగా, రాజ్యాంగ బద్దంగా ఉంటే ఎవరూ వ్యతిరేకంగా పోయిన అది కోర్టు ఎలా నిలబడుతుంది..?
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయలేదు, మోసం చేసింది కాబట్టే కదా బీఆర్ఎస్ ఒక రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల ఇస్తే బీఆర్ఎస్ ఇతర కులాలకు టికెట్ ఎందుకు ఇస్తుంది.?. రిజర్వేషన్ల ప్రకారం బీసీలకే ఇచ్చేది కదా..కాంగ్రెస్ రిజర్వేషన్లు అమలు చేస్తే బీఆర్ఎస్ నాన్ రిజర్వేషన్ వ్యక్తికి ఇస్తే చట్టం ఒప్పుకుంటుందా.?.
బీసీ మేధావులు సూటి ప్రశ్న. బీసీల కోసం పని చేసే రాజకీయ పార్టీ ఏదీ.?.బీసీలు ఏ పార్టీతో ర్యాలీ కావాలని చెపుతున్నారు.?. నమ్మించి చెల్లని బిల్లులు, రాజ్యాంగ సమీక్షలో నిలవని ఆర్డినెన్సులు, న్యాయ స్థానంలో నిలవని బిల్లులు తెచ్చిన కాంగ్రెస్ పార్టీనా..?.లేదా బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించి చట్టం చేసే బీజేపీ పార్టీనా.?. బీఆర్ఎస్ ను టార్గెట్ చేసే క్రమంలో ఎవరి ప్రయోజనాలు కోసం, ఎవరి వోట్లు సీట్ల ప్రయోజనాల కోసం సో కాల్డ్ బీసీ నేతలు నిలబడుతున్నారు.?
42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ బీసీలను మోసం చేయలేదా.?.చట్టాలు బిల్లులు, ఆర్డినెన్సులంటూ నమ్మించి గొంతు కోసింది నిజం కాదా.?. దిల్లీలో ధర్నాలు, జంతర్ మంతర్ వద్ద నిరసనలంటూ తెలంగాణ సామాజాన్ని, బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా.?.పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయకుండా దగా చేసింది కాంగ్రెస్ కాదా. ?.ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయకుండా కేంద్రంపై నెపాన్ని నెట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా..?.
రెండేళ్ల నుంచి బీసీలను రకరకాల కారణాలతో మోసం చేసిన కాంగ్రెస్ కు ఎన్నికల్లో షాక్ ఇస్తేనే కాదా అమలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చేది..మరీ బీఆర్ఎస్ ను ప్రశ్నించడం వల్ల అది కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకుని రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేస్తున్న కూడా బీసీలు తమతోనే ఉన్నారు..బీసీ నేతలు తాము చెప్పినట్లే వింటున్నారు అన్న అహం హస్తం నేతల్లో పెరగదా..? ఎన్నికల్లో కర్రుకాచి వాత పెట్టకపోతే ప్రభుత్వం అమలు చేస్తుందా..?.
జంతర్ మంతర్ వద్ద నిరసనల తర్వాత మళ్ళీ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎందుకు కార్యాచరణ తీసుకోలేదు..?. బీసీలకు న్యాయం జరిగేలా ప్రణాళికలు ఎందుకు సిద్ధం చేయలేదు.?.అసెంబ్లీలో తీర్మానాలు చేసి వదిలేస్తే చట్టాలు పార్లమెంట్ లో చట్టాలు అవుతాయా.?.బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ, లోక్ సభ ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు పార్లమెంట్ లో కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు.?. కనీసం తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎందుకు బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్ లో మాట్లాడటం లేదు..?. ఎందుకు వాళ్ళకు కూడా తెలుసు చట్ట సవరణ జరగకుండా, రాజ్యాంగ సవరణ లేకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు.బీసీల పట్ల కాంగ్రెస్, బీజేపీలది సవతి తల్లి ప్రేమ. బీసీలను వోటు బ్యాంకు గానే చూస్తాయి తప్ప బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ బీజేపీలు ఫైట్ చేయవు.
దిల్లీలో అగ్గిపుట్టిస్తా..మళ్లీ దిల్లీకి వచ్చేది లేదు.. మోదీనే తెలంగాణకు రావాలి..రాకపోతే గద్దె దించుతాం అని దిల్లీలో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి..ఎందుకు బీసీ రిజర్వేషన్లపై తన చిత్తశుద్దిని నిరూపించుకోవడం లేదు.?.బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఎందుకు అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లడం లేదు.?. మోదీ నాకు బడే బాయ్..నేను ప్రధాని చోటే బాయ్‌ను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఎందుకు మోదీ తో మాట్లాడి బీసీలకు 42% రిజర్వేషన్లకు సాధించలేక పోతుండు.?.
కళ్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఇంతలా మోసం చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్‌ను ప్రశ్నించడం సోకాల్డ్ బీసీ నేతల అజ్ఞానమే అవుతుంది. హక్కులపై అధికార పక్షాలను ప్రశ్నించి, నిలదీసినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. అంతేకానీ పాలకవర్గాల భ్రమల్లో ఉంటై ప్రతిపక్షాలను ప్రశ్నిస్తే ప్రయోజనం శూన్యం, వెరసి బీసీలను మరింత అన్యాయం జరుగుతుందన్నది గ్రహించాలి. సోకాల్డ్ బీసీ నేతల ప్రచారం వెనుక,ప్రకటనల వెనుక ఖచ్చింతగా బీసీ ప్రయోజనాలైతే లేవు..ఎవరి ప్రయోజనాలున్నాయో బీసీలు తెలుసుకోవాలి. బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తున్న కొంతమంది బీసీ నాయకుల వెనుక ఎవరి ఎజెండా ఉందో బీసీలు గ్రహించాలి.
-తోటకూర రమేష్





