Take a fresh look at your lifestyle.

జిఓ1కు వ్యతిరేకంగా ఆందోళన

‌విజయవాడ,జనవరి5 : చీకటి జీఓ నెం.1ను రద్దు చేయాలని గొల్లపూడిలో టిడిపి శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో దేవినేని ఉమా నివాసానికి భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. సీఎం డౌన్‌ ‌డౌన్‌, ‌చీకటి జీవో నెం.1ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, పార్టీ శ్రేణులు జీవో ప్రతులను దగ్ధం చేశారు. లోకేష్‌ ‌పాదయాత్ర, చంద్రబాబు సభలు ఆపాలనే ప్రభుత్వం ఈ హత్యలు చేయించిందని మండిపడ్డారు.

దీంతో ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారి మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. ఈ క్రమంలో గొల్లపూడిలో ఉద్రిక్తత ఏర్పడింది. గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ నాయకులపై పోలీసుల దాడి చేశారని ఆరోపిస్తున్నారు. దేవినేని ఉమా అరెస్టును అడ్డుకున్న పార్టీ శ్రేణులపై పోలీసుల విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ ‌ప్రధాన కార్యదర్శి మందా మురళీమోహన్‌, ‌రాష్ట్ర టిఎన్టియుసి అనుబంధ విభాగ ప్రధాన కార్యదర్శి రెంటపల్లి శ్యామ్‌ ‌కు గాయాలు అయ్యాయి. ఎందుకు అరెస్ట్ ‌చేస్తున్నారో వివరణ ఇవ్వాలని దేవినేని ఉమా పోలీసులను కోరారు. బలవంతంగా జీపు ఎక్కించి దేవినేని ఉమాను గొల్లపూడి నుంచి పోలీసులు తరలించారు.

Leave a Reply