– పార్టీకి నష్టం జరగొద్దనే చర్చించాకే లొగుబాటు
– లొంగిపోయిన మావోయిస్ట్ ఆశన్న వీడియో విడుదల
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్25: కేంద్ర బలగాల నిర్బంధం మధ్య మావోయిస్టు పార్టీకి నష్టం జరగొద్దనే ఉద్దేశంతోనే సాయుధ పోరాటాన్ని విరమించాలని కేంద్ర కమిటీలో సమష్టి నిర్ణయం తీసుకున్నామని మాజీ మావోయిస్టు నేత ఆశన్న తెలిపారు. కేంద్ర బలగాల దాడుల నేపథ్యంలో సాయుధ పోరాట విరమణ జరపాలని మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బీఆర్ దాదా నాయకత్వంలోనే కింది స్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తాము ఏకపక్షంగా లొంగిపోయి తుపాకులు అప్పజెప్పామని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆశన్న అన్నారు. దేశవ్యాప్తంగా సాయుధ పోరాటాన్ని విరమించాలని నిర్ణయించినప్పటికీ… సమాచారలోపం కారణంగానే కొంతమంది సీసీ, జడ్సీ సభ్యులు ఈ నిర్ణయాన్ని తప్పుగా భావిస్తున్నారని తెలిపారు. ఇటీవల ఆశన్న, మరో 200 మందికి పైగా మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట మల్లోజుల వేణుగోపాల్ లొంగిపాయారు. ఇద్దరినీ తప్పుపడుతూ విప్లవ ద్రోహులుగా పేర్కొంటూ అభయ్ పేరుతో ఇటీవల ఓ లేఖ విడుదలైంది. ఈ లేఖలోని పలు అంశాలను ఖండిస్తూ ఆశన్న వీడియో విడుదల చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





