మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు

  • మే 6 నుంచి 23 వరకు ఇంటర్‌ ‌ఫస్టియర్‌…‌మే 7 నుంచి 24 వరకు సెకండియర్‌
  • ‌టెన్త్, ఇం‌టర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన బోర్డ్‌లు
  • ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పది పరీక్షలు
  • ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ ‌పరీక్షలు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 16 : తెలంగాణ పదో తరగతి, ఇంటర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌ ‌విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 23వ తేదీ నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ‌ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్‌ ‌సెకండరీ ఎడ్యుకేషన్‌ ‌బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. టెన్త్ ‌పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంటర్‌ ‌పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంటర్మీడియట్‌ ‌బోర్డు బుధవారం విడుదల చేసింది. ఫస్టియర్‌ ‌పరీక్షలు 6 నుంచి మే 23వ తేదీ వరకు, సెకండియర్‌ ‌పరీక్షలు 7 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్ ‌మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8‌వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. జెఇఇ పరీక్షల షెడ్యూల్‌ ‌మారడంతో రాష్ట్ర ఇంటర్‌ ‌బోర్డు పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది.

మే 6 నుంచి మే 24 వరకు ఇంటర్‌ ఎగ్జామ్స్ ‌జరుగుతాయని వెల్లడించింది. మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో ఇంటర్‌ ‌మొదటి సంవత్సరం పరీక్షలు జరగనుండగా.. మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీల్లో ఇంటర్‌ ‌సెకండియర్‌ ‌పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. జేఈఈ పరీక్షలు రాసే విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా..ఇంటర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌ ‌రెండోసారి మారడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఎన్విరాన్‌మెంటల్‌ ‌పరీక్ష ఏప్రిల్‌ 11, 12 ‌తేదీల్లో జరగనుండగా ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్ ‌మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 ‌వరకు నిర్వహించనున్నారు. మరోవైపు ఏఇఇ మెయిన్‌ ‌పరీక్షల తేదీలను నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ రీ-షెడ్యూల్‌ ‌చేసింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌ ‌ప్రకారం ఏప్రిల్‌ 16 ‌నుంచి 21 మధ్య జెఇఇ జరగాల్సి ఉంది. కానీ కొత్త షెడ్యూల్‌ ‌ప్రకారం జేఈఈ మెయిన్‌ ‌పరీక్షలు ఏప్రిల్‌ 21, 24, 25, 29, ‌మే 1, మే 4 తేదీల్లో జరగనున్నాయి. కాగా, తెలంగాణ ఇంటర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌లో మార్పు జరగడంతో పదో తరగతి పరీక్షల తేదీలు కూడా మారింది. మే 23 నుంచి 28 వరకు టెన్త్ ‌క్లాస్‌ ‌పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *