‘‘ప్రజలకు అర్థంకాని భాషలో కాకుండా ప్రజలకు అర్థం అయ్యే భాషలో న్యాయచర్చలు సాగాలి. కోర్టుతీర్పులు స్థానిక భాషల్లో విడుదల చేయాలి. పాలకులు పేదలకు న్యాయన్ని చేరువ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి. అనేక సంస్కరణలు తీసుకుని వచ్చామని చెబుతున్న ప్రధాని మోదీ ఈ న్యాయవ్యవస్థలో ఉన్న లోటుపాట్లను గుర్తించి తక్షణ చర్యలకు పూనుకోవాలి.’’
మన న్యాయవ్యవస్థ ఇంకా బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగానే సాగుతోందని, న్యాయ వ్యవస్థ లో భారతీయీకరణ జరగాలని పదవీ విరమణ చేసిన చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ చేసిన వ్యాఖ్యలు సంస్కరణ లకు పునాది కావాలి. ఆయనచేసిన సూచనలు లేదా హెచ్చరికలతో న్యాయవ్యవస్థలో సమూల మార్పులు జరగాలి. ప్రధానంగా స్థానిక భాషల్లో కోర్టు కార్యకలాలపాలు సాగాలి. కోర్టుల్లో న్యాయ చర్చలను స్థానిక భాషల్లో చర్చించేలా చూడాలి. గతంలో ప్రధాని మోదీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పుడీ విషయంపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అర్థంకాని భాషలో కాకుండా ప్రజలకు అర్థం అయ్యే భాషలో న్యాయచర్చలు సాగాలి. కోర్టుతీర్పులు స్థానిక భాషల్లో విడుదల చేయాలి. పాలకులు పేదలకు న్యాయన్ని చేరువ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి. అనేక సంస్కరణలు తీసుకుని వచ్చామని చెబుతున్న ప్రధాని మోదీ ఈ న్యాయవ్యవస్థలో ఉన్న లోటుపాట్లను గుర్తించి తక్షణ చర్యలకు పూనుకోవాలి. పార్లమెంట్ వేదికగా దీనికి శాశ్వత పరిష్కారం చూపాలి. జస్టిస్ ఎన్‌వి రమణ పలు అంశాలను స్ప•శించారు. వాటిని సలహాలుగా తీసుకుని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగాలి. ప్రజలకు ఏంచేస్తే సత్వర న్యాయం అందుతుందో ఆలోచించాలి. అవసరమైతే మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూ ర్తుల సలహాలు తీసుకోవాలి. ప్రతిపేదవాడికి న్యాయం అందించడమే న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం కావాలని చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ చేసిన వ్యాఖ్యలు దేశంలో న్యాయం పట్ల జరుగుతున్న ఆలస్యాన్ని గుర్తు చేశాయి. ఇదే సందర్భంలో పెండింగ్ కేసులు సమస్యగా మారాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతి తీర్పులోనూ ప్రజల మనసు గెలిచేందుకు ప్రయత్నించానని చెబుతూనే… చివరిశ్వాస వరకు రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేస్తానని హా ఇవ్వడం ద్వారా జస్టిస్ ఎన్వీ రమణ తన నిబద్దతను చాటుకున్నారు. నిజానికి చీఫ్ జస్టిస్‌గా రమణ బాధ్యతలు చేపట్టాక న్యాయవ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసు కున్నాయి. ఇవన్నీ కూడా పేదలకు సత్వర న్యాయం అందాలన్న తపనతో చేసినవే తప్ప మరోటి కాదు. భారత న్యాయవ్యవస్థ సాధారణ ప్రజలకు ఎంతో దూరంలో నిలిచింది. ఇప్పటికీ కోట్ల మంది అణగారిన వర్గాల ప్రజలకు న్యాయ సహాయం అవసరం ఉంది. తమకు అన్యాయం జరిగిందని భావించిన ప్రతి వారూ కోర్టులకు వెళ్లడం లేదు. ఎందుఏకంటే కోర్టులకు వెళితే తేలేదే లేకపోగా అనవసర కాలయాపన, డబ్బులు దండగ అన్న భావనలో ప్రజలు ఉన్నారు. అవసరమైన వెంటనే న్యాయ వ్యవస్థను ఆశ్రయించ డానికి ఇంకా వారు జంకుతూనే ఉన్నారు. న్యాయవ్యవస్థ రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తి స్తున్నప్పటికీ డియాలో తగిన ప్రచారాన్ని పొందలేదని తనకు అనుభవపూర్వకంగా అర్థమైందని రమణ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గమనార్హం. నిజానికి కోర్టులు, రాజ్యాంగం పట్ల ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రజలను కోర్టులకు చేరువ చేయడం రాజ్యాంగ విధి కావాలి. రాజ్యాంగం అంటే పాలకులకు సంబంధించిన వ్యవహారంగా ఉండరాదు. న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు, విశ్వాసం కల్పించేం దుకు చర్యలు తీసుకోవాలి. ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం కలిగించాలి. లోకల్ కోర్టులను పెంచి సత్వర న్యాయం కలిగించాలి. మన న్యాయవ్యవస్థ, ప్రొసీడింగ్స్ ఇంకా ఆంగ్లేయులనాటి విధానాలనే అవలంబిస్తోందని చీఫ్ జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలను ఆషామాషీగా తీసుకోరాదు. అది మన ప్రజల అవసరాలకు అనుగుణంగా లేదన్న భావనను ఆయన వ్యక్త పరచారు. మన న్యాయవ్యవస్థను భారతీయీకరించడం అత్యవసరం అంటూనే.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా న్యాయపాలన జరగాలన్నారు. దీనిని ప్రాతిపదికగా తీసుకుని మన పాలకుల న్యాయవ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి.
నిజానికి చీఫ్ జస్టిస్‌గా రమణ పదవీకాలం తక్కువే అయినా పది కాలాలపాటు గుర్తుంచుకునేలా నిర్ణయాలు తసుకున్నారు. తన కర్తవ్య నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేసారు. కేసుల పరిష్కారంలో కొత్త ఒరవడి తీసుకుని వచ్చారు. కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు విశేషంగా కృషి చేసారు. వేగంగా న్యాయం అందించే దిశలో ఆధునిక మౌలికవసతుల కల్పనను అనేక చర్యలు తీసుకున్నారు. దేశంలోని హైకోర్టులు, ట్రైబ్యునళ్లలో..మూడోవంతు నియామకాలు జస్టిస్ రమణ నేతృత్వంలోని కొలీజియం చేపట్టినవేనని పదవీ విరమణ సందర్భంలో ఇతర న్యాయ మూర్తులు, న్యాయవాదులు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జస్టిస్ రమణ ఎంతో కృషి చేశారని వివరించారు. ఇకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఎన్నో చారిత్రక తీర్పులను వెలువరించారు. సామాన్యుడికి అర్థమయ్యే విధంగా జస్టిస్ రమణ ఇచ్చిన తీర్పులు.. అందరికీ ఆదర్శనీయమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కొనియాడారు.
జస్టిస్ రమణ పదవీకాలం దేశ న్యాయవ్యవస్థకు సువర్ణ అధ్యాయమని వారు పేర్కొనడం తెలుగువారిగా మనకంత గర్వకారణం. హుందాతనం నిండిన వ్యక్తిత్వం, సాహిత్య సాంస్క•తిక రంగాలపై ఆసక్తి, సమన్యాయం, సామాజిక న్యాయం వంటి విలువలపై ఆధునిక దృక్పథం కలిగిన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ పదవీకాలం దేశ చరిత్రలో నిలిచి పోతుందనడంలో సందేహం లేదు. ఆయన లేవనెత్తిన అంశాలు స్ప•శించి ముందుకు సాగితే దేశం సర్వతో ముఖాభివృద్దికి దోహదపడగలదు. పక్షం రోజుల ముందే ఉపరాష్ట్రపతిగా తెలుగు వాడిగా పదవీవిరమణ చేసిన వెంకయ్య నాయుడు కూడా రాజ్యసభలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలో పేతానికి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రధానిగా పివి నరసింహారావు అయితే ప్రపంచ దేశాల్లో భారత్ తలెత్తుకునేలా చేశారు. వీరంతా ఎలాంటి మచ్చ లేకుండా తమ పాలనా కాలంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. తెలుగువారిగా వీరంతా అనేక సాహస కృత్యాలకు ఆద్యులయ్యారని మనమంతా గర్వించాలి. అలాగే జస్టిస్ రమణ చేసిన సూచనల ఆధారంగా న్యాయవ్యవస్థను బలోపేతంచేసి, పేదలకు సత్వర న్యాయం అందిం చేలా ప్రభుత్వాలు కృషి చేసే దిశగా అడుగులు వేయాలి. అలాగే స్థానిక భాషల్లో న్యాయ ప్రక్రియ సాగాలి.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్




