- ప్రమాణస్వీకారోత్సవానికి ముస్తాబైన రాజ్‌భవన్
- విజయవాడ చేరుకున్న నజీర్‌కు సిఎం జగన్ ఘనస్వాగతం
అమరావతి, ఫిబ్రవరి 23 : ఏపీ కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 24న శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకార ఘట్టానికి రాజ్ భవం ముస్తాబు అయింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన చేత ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సిఎం జగన్ సహా మంత్రులు, పలుఉవరు విఐపిలు హాజరు కానున్నారు. దీంతో భారీగగా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే గత రాత్రి గన్నవరం ఎయిర్ పొర్టుకు ప్రత్యేక విమానం ద్వారా వచ్చిన గవర్నర్ నజీర్‌కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. విజయవాడలో గవర్నర్ బస చేసిన రాజ్ భవన్‌కి వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపుగా గంట పాటు ఈ ఏకాంత భేటీ సాగిందని తెలుస్తోంది. ఏపీకి కొత్త గవర్నర్‌గా వచ్చిన నజీర్‌తో సిఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిసినట్లు చర్చ సాగుతోంది.
గవర్నర్ ప్రమాణస్వీకారం తరవాత త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై సిఎం జగన్ దృష్టి సారించనున్నారు.
ఏపీలో ప్రభుత్వం నాలుగేళ్ళుగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం పెట్టుకున్న ప్రాధాన్యతలు వంటి వాటి ద జగన్ గవర్నర్ కి వివరించి ఉంటారని అంటున్నారు. ఏపీకి కొత్త గవర్నర్‌గా నియమితులైన అబ్దుల్ నజీర్ న్యాయమూర్తిగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం పనిచేసి ఉన్నారు. ఆయనకు రాజ్యాంగ పరమైన అంశాలలో ఎంతో నిపుణత ఉంది. ఒక విధంగా అచ్చమైన రాజ్యాంగ నిపుణుడిగా పేర్కొనాలి. అదే సమయంలో ఆయన గవర్నర్ గా రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వహించబోతున్నారు. రాజ్యాంగపరంగా ఏది సహేతుకమో ఏది అవసరమో గవర్నర్‌గా ఆయనకు క్షుణ్ణంగా అవగాహన ఉంటుంది. ఇక రాజకీయపరంగా చూస్తే ఆయన పొరుగునే ఉన్న కర్నాటకకు చెందిన వారు.
ఏపీ రాజకీయాల ద కచ్చితంగా చాలా వరకూ అవగాహన ఉంటుందని అంటున్నారు. ఆయన క్రియాశీలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఎన్నికలు ఏడాదిలో ఉన్న ఏపీలో ఏరికోరి కేంద్రం ఆయనను ఏపీకి గవర్నర్ గా పంపడం వెనక చాలా వ్యూహం ఉండివుంటుందని అంటున్నారు. ఇకపోతే మూడున్నరేళ్ళుగా పాత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో వైసీపీ ప్రభుత్వానికి అంతా సాఫీగా సాగిపోయింది. కొత్త గవర్నర్ నజీర్ తో కూడా అదే సయోధ్యను వైసీపీ ప్రభుత్వం కోరుకుంటోంది. అయితే ఇక్కడ అబ్దుల్ నజీర్ కి కూడా గవర్నర్ పదవి కొత్త అనుభవమే. అయినా కానీ ఆయన రాజ్యాంగ పరిరక్షకుడిగా మాత్రం సీనియర్ కాబట్టి గవర్నర్‌గా తన పదవీ నిర్వహణ ఉంటుందని అంటున్నారు.