అమర కవన యశశ్వి
మధుర గీతాల మహర్షి
సాహితీ ప్రపంచ రాజర్షి
దేవులపల్లి కృష్ణశాస్త్రి
సాహిత్య మాగాణంలో
అక్షర సేద్యం చేసినవాడు
సరిగమల సామ్రాజ్యంలో…
పాటకు పట్టం కట్టినవాడు
వెండి తెర యవనిక పైన
నిండు వెన్నెలై కురిసాడు
పద్య గద్య గేయ రచనలో
కొత్త ఒరవడి సృష్టించాడు
ఆకాశవాణిలో ప్రయోక్తగా
కళామృతం చిలికించాడు
జయ ప్రియ భారతి అని
దేశమాతను కీర్తించాడు
మల్లెల వేళని ప్రేయసికి
మేఘసందేశం పంపాడు
పద్మభూషణ్ కళాప్రపూర్ణ
ఇలా ఎన్నో పురస్కారాల
స్వంతం చేసుకున్నవాడు
తెలుగు బాషా ప్రాశస్త్యం
విశ్వవ్యాప్తి గావించాడు
సాహితీ చరిత్ర పుటల్లో
సువర్ణాక్షరమై నిలిచాడు
అక్షర మల్లీ ఆంధ్రా షెల్లీ
దేవులపల్లి కృష్ణశాస్త్రీకి
భావ కవన నీరాజనాలు
సాహితీ సమాభిషేకాలు
( ఫిబ్రవరి 24న దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్థంతి సందర్బంగా…)
కోడిగూటి తిరుపతి, 9573929493