స్నేహితుని కుటుంబానికి తోటి స్నేహితుల చేయూత : 1 లక్ష నగదు అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 : ఆపద వస్తే దేవుడే దిక్కు అంటారు పెద్దలు.. కానీ ఎప్పుడో చిన్నప్పుడు పాఠశాలలో చదువుకొని తదనంతరం కూడా తోటి స్నేహితులకు చేయూత అందిస్తున్నారు. ఈ పూర్వపు విద్యార్థులు వివరాల్లోకి వెళితే 1991- 92 సంవత్సరంలో కడ్తాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో చదువుకున్న తోటి స్నేహితుడు అక్టోబర్ నెల 25న రేడియోల శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి పూర్వపు విద్యార్థులు తమ స్నేహితుని ఆకస్మిక మరణాన్ని చింతిస్తూ సోమవారం కడ్తాల మండల కేంద్రంలో మరణించిన శ్రీనివాస్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. స్నేహితులందరూ కలిసి తమ చేతనైన సహాయం చేశారు. సుమారు 1 లక్ష రెండు వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులు.. శ్రీను భార్య ప్రభావతి, కొడుకు ప్రశాంత్, కూతుళ్లు సిరి, లక్ష్మి ప్రసన్న కు తోటి స్నేహితులు అందజేశారు. కుటుంబానికి ఎప్పుడు చేదోడు వాదోడు గా ఉంటామని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం తోటి స్నేహితులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, చాట్ల వెంకటేష్, ఎండి. జహంగీర్ అలీ, గంప శ్రీనివాస్, మానిటర్ చంద్రశేఖర్, రమేష్ గౌడ్, రాఘవేందర్, తమ్ముడు శేఖర్, అశోక్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *