సూర్యాపేట జిల్లాకు వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామపంచాయితీల అభివృద్ధి కోసం రూ. 10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు హాజరైన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. ఇక సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ. 50 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. సూర్యాపేటకు కళాభారతి కావాలని మంత్రి జగదీష్‌ రెడ్డి కోరారని రూ. 25 కోట్లతో కళాభారతిని మంజూరు చేస్తున్నా అని ప్రకటించారు. స్టేడియం, స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకు కూడా వెంటనే జీవో రిలీజ్‌్‌క్ష చేస్తామని తెలిపారు. మంత్రి జగదీష్‌ రెడ్డి అడిగినట్లు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ కూడా మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *