సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌కు మంత్రి కెటిఆర్‌ ‌లీగల్‌ ‌నోటీస్‌

  • తగ్గేదే లేదంటూ ఘాటుగా స్పందించిన సుఖేష్‌
  • ఆరోపణలకు ఆధారాలు
  • ఉన్నాయంటూ వెల్లడి

న్యూ దిల్లీ, జూలై 20 : మంత్రి కేటీఆర్‌ ‌లీగల్‌ ‌నోటీసుకు జైల్లో ఉన్న సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌ ‌స్పందించారు. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. తన వద్ద ఆధారాలున్నాయని.. దర్యాప్తునకు రెడీ అని వెల్లడించారు. జైల్లో ఉంటూనే సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌.. ‌కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీంతో కేటీఆర్‌ ‌తన న్యాయవాది ద్వారా సుఖేష్‌కు లీగల్‌ ‌నోటీసు పంపారు. తనపై తప్పుడు వివరాలతో గవర్నర్‌, ‌కేంద్ర హోంమంత్రి, సీబీఐకి లేఖల ద్వారా సుఖేష్‌ ‌ఫిర్యాదు చేశారని.. కాబట్టి వెంటనే తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పి ఫిర్యాదును వెనక్కు తీసుకోకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

భవిష్యత్తులోనూ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని లీగల్‌ ‌నోటీసులో కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ ‌కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌ ‌చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్‌ ‌ట్విట్టర్‌ ‌వేదికగా స్పందించారు. నేరస్తుడు, మోసగాడు సుఖేష్‌ ‌తనపై చేసిన మతిలేని ఆరోపణలు డియా ద్వారా తన దృష్టికి వచ్చాయి. సుఖేష్‌ అనే వాడి గురించి నేనెప్పుడూ వినలేదు. వాడెవడో కూడా నాకు తెలియదు. సుఖేష్‌ అనే ఒక రోగ్‌ ‌చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటాను. సుకేష్‌ ‌లాంటి నేరస్తుడు మోసగాడు చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను డియాలో ప్రసారం చేసే ముందు లేదా ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని అంటూ డియాకు ట్విట్టర్‌ ‌ద్వారా మంత్రి కేటీఆర్‌ ‌విజ్ఞప్తి చేశారు. కాగా.. తెలంగాణ గవర్నర్‌ ‌తమిళసై సౌందర్‌ ‌రాజన్‌కు సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌ ‌లేఖ రాసిన విషయం తెలిసిందే.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌పై సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌ ‌మరో సంచలన లేఖ రాశారు. నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్‌ ‌తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్‌ ‌వద్ద భూమి, అసెంబ్లీ సీట్‌ ఇస్తామని ఆశపెడుతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కవితకు నాకు మధ్య జరిగిన వాట్సాప్‌ ‌చాట్‌ అం‌తా రికార్డింగ్‌ ఉం‌ది. ఈ ఆధారాలని ఇప్పటికే ఈడీకి 65 -బి సర్టిఫికెట్‌ ‌రూపంలో ఇచ్చేశా. కవిత నుంచి రూ.15 కోట్ల నగదు తీసుకొని అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌తరపు వారికి అందజేశా. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నా అంటూ గవర్నర్‌ ‌తమిళసైకు సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌ ‌లేఖ రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *