జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
తెలంగాణ ప్రాంతంలో సహజ,ఆర్థిక వనరుల దోపిడీ తీవ్రంగా జరుగుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు ను ఆదివారం హైదరాబాద్ మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో నిర్వహించారు.. మొత్తంగా మూడు సెషన్ లుగా ఈ సదస్సు కొనసాగింది.మొదటి సెషన్ కు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అధ్యక్షత వహించగా హాజరైన వక్తలు జయశంకర్ చిత్ర పఠానికి పూలమాలలు వేసి నివాళు లు అర్పించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ, ఆర్థిక వనరుల దోపిడీ విపరీతంగా జరుగుతుందని అన్నారు. సహజ వనరుల దోపిడి ఏ విధంగా జరిగిందో,జరుగుతుందో విద్యావంతులు తమకు తాము ప్రశ్న వేసుకోకపోతే ముంధు కు పోవడం సాధ్యం కాదు అన్నారు.ఈ సమాజానికి చెందిన సహజ వనరులు ఎవరి చేతిలో ఉన్నాయి.?తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి.? వీటిని తెలంగాణ సమాజానికి చెందెటట్లు ఏట్లా చేయాలి.! దోపిడి చేస్తున్న వారు తెలిసిపోయింది.దోపిడీ కి గురవుతున్న వారిని గుర్తించలేనంత స్థాయికి సమాజాన్ని నెట్టివేసినం.ఆ వైపు గా గుర్తించే బాధ్యత ను కొనసాగించాలన్నారు. దోపిడీదారులను దోపిడీదారులకు వత్తాసు పలుకుతున్న వారిని దోషులుగా తెలంగాణ సమాజం ముందు ఉంచాలి అన్నారు. ప్రజల ఆస్తులను అప్పనంగా దోపిడీదారులకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అంటున్నం. కొట్లాడిన వారు భాగం కాకుంటే ముందుకు ఏలా పోతది తెలంగాణ.కొట్టినవారే బాగమవుతే పున:నిర్మాణమా.!.పాలకులు మన యాసను భాషను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నారు.సేవ చేసేవారు వ్యాపారం చేయడం తో రాజ్యంగంలోని ఆదేశిక సూత్రాలు ఉల్లంఘించబడుతున్నాయి అన్నారు.పున:నిర్మాణం అంటే ఆకాశ హర్మియాలు కాదు కధా.! ప్రాధమికంగా జరగాల్సిన మార్పు ఏమైనా జరిగిందా.! అంటే జరుగలేదు.మార్పు రావాల్సిన చోట మార్పు రావడం లేదు అన్నారు.విద్యావంతుల వేదిక ప్రస్తుత కర్తవ్యం పౌర సమాజం ఏలా నడుచుకోవాలో ప్రణాళిక చేస్తే బాగుంటదని సూచించారు.చర్చలు,సంభాషణల ద్వారా ముందుకు పోతే ఒక నిర్థిష్ఠమైన కార్యచరణ కు అవకాశం ఉంటదనే ఆశాభావం వ్యక్తం చేశారు.




