సమిష్టిగా ఉంటేనే గ్రామానికి గౌరవం వొచ్చింది

  • ఆలస్యమైనా ఆదర్శ వంతమైనా గ్రామంగా తీర్చిదిద్దారు
  • దత్తత గ్రామం ఇబ్రహీమ్‌పూర్‌లో పర్యటించిన మంత్రి హరీష్‌ ‌రావు

సిద్ధిపేట, మార్చి 24(ప్రజాతంత్ర బ్యూరో) : ‘సమిష్టిగా ఉంటేనే మీ గ్రామానికి గౌరవం వొచ్చింది. ఐకమత్యంతో ఆదర్శంగా తీర్చిదిద్దిన ప్రజలకు శుభాకాంక్షలు. గొర్రెలు, పాడి పశువుల హాస్టల్స్ ఉపయోగించుకుంటే.. రైతులకు మేలు జరుగుతుంది. అలాగే గ్రామ పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది. గ్రామంలో హెల్త్ ‌సెంటరు ఏర్పాటు చేశాం. 70 రకాల వైద్య పరీక్షలు జరుగుతాయి. గ్రామ ప్రజలందరీ హెల్త్ ‌ప్రొఫైల్‌ ‌తయారు చేయాలి’ అని మంత్రి హరీష్‌ ‌రావు తన సిద్ధిపేట జిల్లా ఇబ్రహీమ్‌పూర్‌ ‌పర్యటనలో అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం దత్తత గ్రామమైన ఇబ్రహీమ్‌పూర్‌లో రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు గురువారం పర్యటించారు.

గ్రామంలో 37 మంది లబ్ధిదారులతో కలసి డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌లలో గృహా ప్రవేశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్‌ ‌రావు హాజరయ్యారు. గ్రామంలో అంగన్‌ ‌వాడీ కేంద్రం, కిచెన్‌ అం‌డ్‌ ‌డైనింగ్‌ ‌షెడ్‌, ‌సామూహిక పాడి పశువుల వసతి సముదాయం, డ్రోన్‌ ‌ద్వారా పంటలపై పిచికారీ ప్రారంభించి, ప్రయోజనాలపై వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించారు. ఫోన్‌ ‌మెస్సేజ్‌ ‌ద్వారా మోబైల్‌ ‌యాప్‌ ‌ద్వారా మోటారు ఆపరేట్‌ ‌చేసే పంప్‌ ‌రూమ్‌ ‌ప్రారంభించారు. అనంతరం నాట్కో సహకారంతో మోబైల్‌ ‌క్లినిక్‌ ‌ప్రారంభించారు. ఈ మేరకు గ్రామానికి సహకరించిన ప్రముఖులు వ్యాపార సంస్థ ప్రతినిధులను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ…కొరోనాతో 2 సంవత్సరాలుగా  పనులు ఆలస్యమయ్యాయి, అయినా…ఆదర్శ వంతమైన గ్రామంగా మార్చారు. గొర్రెల హాస్టల్‌లు  దేశంలోనే ఆదర్శంగా నిల్చాయి, పాడి పశువుల హాస్టల్‌ను  అందరు వినియోగించుకోవాలని అన్నారు. పశువు లు పాటలు విని పాలు ఎక్కువగా ఇస్తవనీ50 లక్ష తో డైనింగ్‌ ‌హల్‌ ‌నిర్మించుకున్నామన్నారు. విలేజీ హెల్త్ ‌సెంటర్‌ ‌లో 70 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారనీ, విలేజీ హెల్త్ ‌ప్రొఫైల్‌ ఒకటి తయారు చేయాలనీ వైద్య అధికారులను మంత్రి ఆదేశించారు. వొచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇబ్రహీమ్‌పూర్‌ ‌స్కూల్‌లో ఇంగ్లీష్‌ ‌మీడియం అమలు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో దళిత బంధు అమలు చేయిస్తానని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *