శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర ,డిసెంబర్ 7: ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి విజయం సాధించిన ఆరెకపూడి గాంధీకి అభినందనలు వెళ్ళు వెత్తుతున్నాయి. ఈ మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించిన శుభసందర్బంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, పలు కాలనీల అసోసియేషన్ సభ్యులు తదితరులు వివేకానంద నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.శేరిలింగంపల్లి ప్రజానీకానికి ఎల్లవేళల ఋణపడి ఉంటనాని , నన్ను వెన్నంటి ఉండి నడిపించిన కేసీఆర్ , కేటీఆర్ లకు బిఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్లకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు,ఉద్యమకారులకు, కార్యకర్తలకు ,కాలనీ అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేశారు.మరింత భాద్యతగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.




