వొచ్చే ఎన్నికల్లో చారిత్రక తీర్పు ఇవ్వాలి : తుమ్మల

ఖమ్మం,ప్రజాతంత్ర, అక్టోబర్‌25:‌తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌నేత తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఖమ్మం 54వ డివిజన్‌లో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అధినే• చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టుకు నిరసనగా చేసిన ర్యాలీలో ఖమ్మం ప్రజానీకం పోటెత్తారని అన్నారు. ఖమ్మం ప్రజానీకం రాజ కీయ చైతన్యం కలవారని, ఖమ్మంలో నెలకొన్న అరాచక రాజకీయాన్ని తరిమి కొట్టడంలో రంతా కథం తొక్కాలని పిలుపిచ్చారు. ఎన్టీ రామారావు తనకు రాజకీయ జన్మ ఇస్తే.. అధికారంలో ఉన్నపుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడ్డానని చెప్పారు. ప్రజలంతా ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో చారిత్రక తీర్పు ఇవ్వాలని తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *