‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఒక్క బోధనా సిబ్బంది పోస్టు భర్తీ చేయక పోగా, ప్రైవేటు విశ్వ విద్యాలయాలు ఇబ్బడి ముబ్బడిగా శాంక్షన్ చేసి విద్య తమ బాధ్యత కాదని చేతులు దులుపుకుంది. శతాబ్దం కిందట వెలసిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యాభై సంవత్సరాల క్రిందట 52 విభాగాలు ఏడువందల మంది బోధనాసిబ్బంది ఉండేవారు. ఇప్పుడు కేవలం 24 విభాగాలు పట్టుమని వంద మంది సిబ్బందితో విభాగాలు ఉన్నాయా అన్న ప్రశ్న తలెత్తుతుంది.’
గతమెంతో ఘనకీర్తి దశాబ్దాల చరిత్ర కలిగిన విశ్వ విద్యాలయాలు నేడు నిర్మానుష్యంగా ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఒక్క బోధనా సిబ్బంది పోస్టు భర్తీ చేయక పోగా, ప్రైవేటు విశ్వ విద్యాలయాలు ఇబ్బడి ముబ్బడిగా శాంక్షన్ చేసి విద్య తమ బాధ్యత కాదని చేతులు దులుపుకుంది. శతాబ్దం కిందట వెలసిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యాభై సంవత్సరాల క్రిందట 52 విభాగాలు ఏడువందల మంది బోధనాసిబ్బంది ఉండేవారు. ఇప్పుడు కేవలం 24 విభాగాలు పట్టుమని వంద మంది సిబ్బందితో విభాగాలు ఉన్నాయా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక పదిహేను సంవత్సరాల క్రిందట వెలసిన తెలంగాణ విశ్వవిద్యాలయం, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, జేఎన్టీయూ, ట్రిపుల్ ఐటీ లో బోధనా సిబ్బందిలేక శ్మశాన ప్రశాంతత నెలకొంది. ఇలాగే మరికొద్ది కాలం గడిస్తే అన్ని విభాగాలు మూసుకోవాల్సిందే. కీలకమైన విభాగాలలో బోధనేతర సిబ్బంది లేరు. పరీక్షల విభాగం, కాలేజీ డెవలప్మెంట్ సెల్, కాన్ఫిడెన్షియల్ పనులు కూడా కాంట్రాక్టు సిబ్బంది చేతుల్లోకి వెళ్ళి చాలాకాలం అయ్యింది.ఏడాదికి ఒకసారి కళాశాలలకు తనిఖీలు చేయాలన్న కనీసం ఎనిమిది వందల మంది అధ్యాపకులు కావాలి. అలాగే సెలెక్షన్ కమిటీ తూతూ మంత్రంగా జరపాలన్న ఐదు వందల మంది అధ్యాపకులు కావాలి. ఉన్న అధ్యాపకులు ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్, రెక్టార్, డీన్, డైరెక్టర్ అడ్మిషన్స్, అకడమిక్ అడిట్, ప్లానింగ్, రీసర్చ్, ఎవాల్యుయేషన్, కాంట్రొల్లర్, అసిస్టెంట్ కంట్రోల్లర్, వైస్ ప్రిన్సిపాల్, వార్డెన్, ప్లేస్మెంట్ ఆఫిసర్, అకడమిక్ స్టాఫ్ కాలేజీ డైరెక్టర్ ఇలా ప్రతి ఒక్కరికి రెండు లేదా మూడు పోస్టులు అదనంగా ఉంటున్నాయి. వీళ్ళు బోధన మరచి చాల రోజులయ్యింది. ఒక్కటంటే ఒక్క రీసర్చ్ గ్రాంటు కు రిపోర్టు రాయడం చేతకాదు. మైనర్, మేజర్, టెక్విప్, స్టార్ట్ అప్ గ్రాంట్లు రావడం లేదు, యూనివర్సిటీ కళాశాలల్లో పరిశోధనలు పడకేసి చాలాకాలమయింది. ఈమధ్యనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సెంట్రలైజ్డ్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు కానుంది. విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీని ఈ బోర్డు చేపట్టనుంది. ప్రస్తుతం యూనివర్సిటీలు వేర్వేరుగా ఖాళీలను భర్తీ చేస్తున్నాయి. వేర్వేరుగా కాకుండా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలను ఒకే బోర్డు ద్వారా ఒకేసారి భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పడు గవర్నరు కొత్త పద్దతిలో చిక్కులు ఉంటాయని అది యూజీసీ కి విరుద్దంగా ఉన్నట్లు తనకు తోచిందని తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజభవన్ కు వచ్చి వివరణ ఇవ్వాలని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం మెడికల్ యూనివర్సిటీలు కాకుండా 15 విశ్వవిద్యాలయాలున్నాయి. ఈ విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత నియామకాలు చేపడుతున్నాయి విశ్వవిద్యాలయాలు. వేర్వేరుగా రిక్రూట్మెంట్స్ చేయడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. నిరుద్యోగులు కూడా ప్రతీ యూనివర్సిటీకి అప్లై చేయాల్సి వస్తోంది. ఇలా పలు అంశాలను, సమస్యల్ని పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో నియామకాలు వేర్వేరుగా కాకుండా ఈ 15 యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ ఒకే బోర్డు ద్వారా జరపాలని భావించింది. అందుకే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఉంటారు. కన్వీనర్‌గా కళాశాల విద్యా శాఖ కమిషన్ మెంబర్ ఉంటారు. ఆర్థిక శాఖ, విద్యాశాఖ అధికారులు బోర్డు సభ్యులుగా ఉంటారు.
కామన్ రిక్రూట్మెంట్ బోర్డు విధివిధానాలు ఎలా ఉంటాయన్నదానిపై గైడ్‌లైన్స్ త్వరలో విడుదల కానున్నాయి. ఈ బోర్డు పనిచేయడానికి అయ్యే ఖర్చుల్ని తెలంగాణ ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీలు సమానంగా భరిస్తాయి. ఈ బోర్డు ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ చట్టాల్లో సవరణల్ని కూడా ప్రతిపాదించనుంది ప్రభుత్వం. ఎదో ఒక రూపాన ఉద్యోగం దక్కితే చాలని అభ్యర్థులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ రోస్టర్ ఎలా పాటిస్తారన్న సందేహం బిసి, ఎస్సి,ఎస్టీ వర్గాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. లాస్ట్ రోస్టర్ పాయింట్ ఎక్కడ నిలిచింది ఇప్పుడు ఎక్కడ నుండి మొదలవుతుంది అలాగే లోకల్ నాన్ లోకల్ సమస్య రాకుండా చూడాలి. తీవ్ర కాలయాపన చేసి, వాటిపై తమ పార్టీ వారినే కోర్టులో కేసులు వేసి నాన్చే ధోరణి అవలంబిస్తున్నది. నియామకాలపై చిత్తశుద్ధి ఉంటే సత్వరమే ప్రక్రియ మొదలు పెట్టి రెండు నెలలలో పూర్తి చేస్తే మంచిది లేకపోతే విశ్వవిద్యాలయాలు శాశ్వితంగా మూసుకోవాల్సిందే.

డా. యం. సురేష్ బాబు, అఖిలభారత విద్య హక్కు వేదిక.