విభజనపై ప్రధాని మోదీ ప్రసంగం తెలంగాణ రాష్ట్రానికి అవమానం

రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కించపరచడమే
ఏఐసీసీ అధినేత రాహుల్‌ ‌గాంధీ

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అగౌరవ వ్యాఖ్యలు రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని అవమానించడమే తప్ప మరొకటి కాదని ఏఐసీసీ అధినేత రాహుల్‌ ‌గాంధీ మంగళవారం అన్నారు. ‘తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై ప్రధాని మోడీ అగౌరవపరిచే ప్రసంగం తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని అవమానించడమే’ అని తెలుగులో ట్విటర్‌ ‌వేదికగా పోస్ట్ ‌చేసిన సందేశంలో రాహుల్‌ ‌గాంధీ అన్నారు. సోమవారం పార్లమెంటులో ప్రసంగిస్తూ, ఆంధప్రదేశ్‌ ‌నుంచి తెలంగాణను విభజించడం రెండు రాష్ట్రాల్లో రక్తపాతానికి దారితీసిందని ప్రధాని మోడీ దుయ్యబట్టారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *