వరదల పరిస్ఠితి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు

వరదలు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు నియామకం. -పరిస్థితిని సమీక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు
భద్రాచలం ప్రజాతంత్ర, జూలై 20 :
గోదావరి వరద క్రమంగా పెరుగుతున్నందున 71అడుగులు వరకు పెరుగుతుందని దృక్పథాన్ని మనసులో పెట్టుకొని సంబంధిత స్పెషల్ ఆఫీసర్లు అధికారులు వారి సిబ్బందిని అందుబాటులో ఉంచుకొని ఏ ఒక్క ప్రాణానికి హాని జరగకుండా చూడాలని వరదల ప్రత్యేక సెక్రెటరీ గౌతంపోట్రూ కృష్ణా ఆదిత్య అధికారులకు ఆదేశించారు.
గురువారం నాడు రాత్రి ఐటీడీఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ వినీత్ ఏ ఎస్ పి పారితో స్ పంకజ్ తో కలిసి భద్రాచలం వరదల ఉధృతి పై ముంపు ప్రాంతాలలో తీసుకోవలసిన ఏర్పాట్లపై సమీక్షించారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యధికంగా వరద ముంపునకు గురి అయ్యే మండలాలు దుమ్ముగూడెం అశ్వాపురం లలో రెండు ndr బృందాలను పంపిస్తున్నామని సమస్యతకమైన గ్రామాల ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు అందరూ సిబ్బందితో కలిసి భద్రాచలంలోనే అందుబాటులో ఉండాలని అలాగే డివిజన్ స్థాయి గ్రామస్థాయి సిబ్బంది అందరిని వరద పెరుగుతున్న కొద్దీ ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని గ్రామాలలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే వాట్సాప్ ద్వారా తెలియజేయాలని విస్తా కాంప్లెక్స్ కొత్త కాలనీలో ని కుటుంబాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యంగా శానిటేషన్ పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. పునరావాస కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని చిన్న పిల్లలకు స్నాక్స్ బిస్కెట్స్ ఇవ్వాలని అలాగే పునరా వాస కేంద్రాలలో తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని సివిల్ సప్లై ద్వారా బియ్యం సరఫరా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని కరెంటు మంచినీరు సక్రమంగా ఉండాలని పునరావాస కేంద్రాల నుంచి సమస్యలు ఉన్నట్టు తమ దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ముంపు ప్రాంతాలలోని పాడు పడ్డ ఇండ్లు పురాతన భవనాలు ఏమైనా ఉంటే ప్రజలు ఆ ఇళ్లల్లో ఉండకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే వెంటనే ముందుగానే ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని శానిటేషన్ పరంగా ఎక్కడ ఇబ్బందులు కలకుండా చూసుకోవాలని తెలుపుతూ ముఖ్యంగా అధికారులు వారి సిబ్బందిని ఎప్పటికప్పుడు సూచనలిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డీవో రత్న కళ్యాణి ఇరిగేషన్ ఎస్సీ వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *