దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కింగ్‌పిన్ కేజ్రీవాల్
ఇది ఓ వందకోట్ల వ్యవహారం మాత్రమే కాదు
ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ మాత్రమే
కవితతో నేరుగా మాట్లాడినట్టు ఈడీ అధికారుల వెల్లడి
కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశ పెట్టిన ఈడీ
న్యూదిల్లీ,మార్చి22: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కింగ్‌పిన్ కేజ్రీవాల్ అని ఈడ్నీ అధికారులు తెలిపారు. ఇది కేవలం వందకోట్ల వ్యవహారం కాదని, లంచాల్లో భాగస్వామ్యం కూడా తోడు కావడంతో ఈ మొత్తం కనీసం రూ.600కోట్లు ఉంటుందని ఈడీ కోర్టుకు తెలియచేసింది. గురువారం రాత్రి అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రశ్నించేందుకు కేజీవ్రాల్‌ను 10 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని జడ్జిని ఈడీ కోరింది. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ కేజీవ్రాల్‌ను గురువారం రాత్రి 9:05 గంటలకు అరెస్టు చేశామని, 24 గంటల్లోపు అతడిని జడ్జి ముందు హాజరుపరిచినట్టు ఈడీ పేర్కొంది.
రిమాండ్ కోరుతూ దరఖాస్తు ఇచ్చామని, అన్ని నిబంధనలను పాటించి కేజీవ్రాల్‌ను అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు కోర్టుకు వెల్లడిరచారు. కేజీవ్రాల్ అరెస్టుపై బంధువులకు కూడా సమాచారం అందించామని, అరెస్టుకు సంబంధించిన ఆధారాలను 28 పేజీల్లో రాతపూర్వకంగా అందజేశామని వివరించారు. అరెస్టు పంచనామా కూడా తమ వద్ద ఉందని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడిరచారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజీవ్రాల్ కీలకమైన వ్యక్తి అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు డబ్బులు అడిగారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ వెల్లడిరచింది. అక్రమ మార్గంలో వచ్చిన ఈ డబ్బుని గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగిం చిందని పేర్కొంది. మద్యం విధానం రూపకల్పనలో కేజీవ్రాల్‌కు ప్రత్యక్ష పాత్ర ఉందని, స్కామ్‌లో ప్రధాన వ్యక్తి ఆయనేనని తెలిపింది. ఇక ఈ కేసులోనే అరెస్టయిన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ లభించలేదని న్యాయస్థానం దృష్టికి ఈడీ పేర్కొంది. ఈ కేసులో సహ నిందితురాలుగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని ప్రస్తావించింది. ఆప్ మాజీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వద్ద పనిచేస్తున్నారని, కేజ్రీవాల్‌తో చాలా సన్నిహితంగా ఉండే విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించాడని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ డబ్బు డిమాండ్ చేశారని, ఈ విషయాన్ని నిరూపించడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. రెండు పర్యాయాలు నగదు బదిలీ జరిగిందని వివరించారు. సౌత్ గ్రూప్‌కు లిక్కర్ పాలసీలో లబ్ది చేకూర్చేందుకు ముడుపులు తీసుకున్నారని వివరించారు.
లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగంగా ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్ కలిశారని, కలిసి పని చేద్దామంటూ కవితతో సీఎం కేజ్రీవాల్ చెప్పారని ఈడీ పేర్కొంది. విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ కోసం పనిచేశారని, గోవా ఎన్నికల సమయంలో రూ.45 కోట్లు చేతులు మారాయని కోర్టుకు ఈడీ వెల్లడిరచింది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలలో ఫోన్ రికార్డస్ కూడా ఉన్నాయని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ తెలిపింది. విజయ్ నాయర్‌కు సంబంధించిన కంపెనీ నుంచి ఆధారాలు సేకరించామని, రూ.45 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు తేలిందని, పెద్ద మొత్తంలో నిధులు వివిధ వ్యక్తుల ద్వారా చేతులు మారాయని వివరించింది. మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ కీలకసూత్రధారి అని ఈడీ ఆరోపించింది. ‘సౌత్ గ్రూప్’ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్‌పిన్. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలుకు ‘సౌత్ గ్రూప్’ సంస్థ నుంచి కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారు. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్లు డిమాండ్ చేశారు. రూ.45 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారు. అవి నాలుగు హవాలా మార్గాల నుంచి వచ్చాయని ఈడీ తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ఈడ్నీ వాదనలను కేజ్రీవాల్ అడ్వకేట్ మను సింఘ్వి తీవ్రంగా ఖండిరచారు. ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేశారని అన్నారు. ఆధారాలు ఉంటే కస్టడీ ఎందుకని ప్రశ్నించారు.
దేశసేవకే నా జీవితం అంకితం:దిల్లీ సీఎం కేజ్రీవాల్
ఈ దేశానికి సేవ చేసేందుకు నా జీవితం అంకితం చేశానని తన అరెస్టుపై కేజ్రీవాల్ తొలిసారిగా స్పందించారు. జైల్లో ఉన్నా బయట ఉన్నా అది కొనసాగిస్తానని కోర్టు హాలుకు వెళ్తూ ఆయన డియాతో అన్నారు. తనపై మోపిన నిందను తొలగిస్తానని అన్నారు. సీఎం అరెస్టుతో దిల్లీ రాజకీయం వేడెక్కింది. ఈ కేసులో ఆయనకు రిమాండ్ విధించినా జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఇప్పటికే ఆప్ నేతలు వెల్లడిరచారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని పిటిషనర్ కోరారు. కేజ్రీవాల్ ఓ వ్యక్తి కాదు.. సిద్దాంతమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఆప్ శ్రేణులు ఆయన వెంటే ఉన్నాయని చెప్పారు. అరెస్టు నేపథ్యంలో ఆయన శుక్రవారం దిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని మాట్లాడారు. అంతకుముందు ఆప్ నేతలు రోడ్డెక్కారు. భాజపా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిరసనలు చేపట్టిన మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. సీఎం కుటుంబసభ్యులను గృహ నిర్బంధంలో ఉంచినట్లు దిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు.
సుప్రీంలో కేజ్రీవాల్ కేసు ఉపసంహరణ
దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలును ఉపసంహరించుకున్నారు. మనీలాండరింగ్ విచారణకు సంబంధించి కేజ్రీవాల్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ప్రత్యేక సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. ఈ విచారణ.. ట్రయల్ కోర్టులో రిమాండ్ ప్రొసీడిరగ్స్‌తో క్లాష్ అవుతుందని సీఎం తరఫు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. అందువల్ల పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు.మరోవైపు కేజ్రీవాల్ కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. సీఎం కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తమను అడ్డుకుంటున్నారని చెప్పారు. వారిని గృహనిర్బంధంలో ఉంచారని, ఏ చట్టం ప్రకారం తనను అడ్డుకుంటున్నారో చెప్పాలని పోలీస్ అధికారులను ప్రశ్నించారు. గతంలోనూ రాజకీయాలలో అరెస్టులు జరిగాయని.. కానీ ఇలా ఎన్నడూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ’సిట్టింగ్ సీఎంను కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయడం ఇదే తొలిసారి. జారండ్ ముఖ్యమంత్రి కూడా అరెస్టుకు ముందే రాజీనామా చేశారు. దేశ చరిత్రలో లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత సీఎం అరెస్టు అవడం ఇదే తొలిసారి. జాతీయ పార్టీ జాతీయ కన్వీనర్‌ను అరెస్టు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు బీజేపీ రాజకీయ కుట్ర. జెడ్‌ప్లస్ కేటగిరీ ఉన్న కేజ్రీవాల్‌కు భద్రత గురించి ఆందోళన చెందుతున్నాం.





