‌రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం గురువారం ఇంటీరియర్‌ ఒడిస్సాలోని మధ్య భాగాలు, పరిసరాళ్లలోని చత్తీస్‌ఘడ్‌ ‌వద్ద కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలో టర్ల వరకూ వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకి వాలి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోటర్లు ఉండవచ్చని తెలిపింది. ముఖ్యంగా నేడు రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *