కొత్తగా 345 మందికి పాజిటివ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు క్రితం రోజుకన్నా పెరిగినా మొత్తం మీద నిలకడగా ఉన్నాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 345 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తాజాగా 345 కొరోనా కేసులు నమోదు కాగా హైదరాబాద్ జిల్లాలో కొత్తగా 146 కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలో 32 కేసులు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 8,32,219 కాగా, మొత్తం మృతుల సంఖ్య 4,111గానే ఉంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,25,356 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,752గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.




