మోసపూరిత కాంగ్రెస్ పార్టీ హామీలకు మోసపోవద్దు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 7: కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మోసపూరిత హామీలకు ప్రజలు మోసపోవద్దని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాండూరు పట్టణంలోని 3 వ వార్డు 4 వార్డు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి మాట్లాడుతూ వారంటీ గ్యారెంటీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టి చెప్తున్నా హామీలకు మోసపోవద్దని అడ్రస్సు లేని పథకాలు ఆరుగ్యారెంటీలు అని అన్నారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలు చేసె మోసపూరితమైన మాటల్ని  అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మకూడదని అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని మరొక్కసారి పైలట్ రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని  తాండూరు అభివృద్ధిలో భాగస్వాములు కాగలరని మనవి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో  మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ , మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నర్సింలు , తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వీణ శ్రీనివాస్ చారి , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభ రాణి , మహిళా అధ్యక్షురాలు సంగీత ఠాగూర్ , కౌన్సిలర్ అస్లం , మాజీ కౌన్సిలర్ సిహెచ్ అనురాధ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాసిం, మాజీ ఉర్దూగర్ చైర్మన్ సలీం , వార్డు ఇన్చార్జ్ అక్రమ్ , సోషల్ మీడియా కన్వీనర్ రమేష్ టైలర్,యువ నాయకులు అనంత్ రెడ్డి, వెంకట్ సుబ్బు, బోయ నరేష్, మల్లేష్ యాదవ్, మహిళా నాయకులు అనిత రమేష్, నిర్మల మరియు వార్డు మహిళలు ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *