మంత్రి హరీష్ రావు ప్రకటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : తెలంగాణలోని మైనార్టీలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు శుభవార్త వినిపించారు. రాష్ట్రంలోని పేద మైనార్టీలకు ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తుందని మంత్రి ప్రకటించారు. బిసిల తరహాలో వీరికి అందచేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన మైనార్టీ చైర్మన్ల అభినందన సభలో హరీష్ రావు ఈ విషయాన్ని ప్రకటించారు.
బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ ఆర్థిక సాయం అందజేస్తామని స్పష్టం చేశారు. మైనార్టీలకు ఆర్థిక సాయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మైనార్టీలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.




