బెంగాల్ ల్లో ఘోర రైలు ప్రమాదం

ఆగివున్న రైలును ఢీకొన్న గూడ్స్
‌కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌కు తీవ్ర ప్రమాదం
మూడు బోగీలు ధ్వంసం..15 మంది మృతి
సహాయక చర్యలకు ఆదేశించిన సిఎం మమతా, కేంద్ర మంత్రి వైష్ణవి అశ్విన్‌
‌రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాతి..
మృతుల కుటుంబాలకు 2 లక్షల సాయం ప్రకటన

కోల్‌కతా, జూన్‌ 17 : ‌పశ్చిమ బెంగాల్లోని రంగపనీర్‌ ‌స్టేషన్‌ ‌సవి•పంలో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును వెనుక నుంచి వేగంగా వొచ్చిన గూడ్స్ ‌రైలు ఢీకొట్టడంతో కాంచనజంగా రైలు వెనుక భాగంలోని మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది ప్రయాణికులు మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అసోంలోని సిల్చార్‌ ‌నుంచి కోల్‌కతాలోని సీల్దాకు వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ ‌సిలిగురి దాటిన తర్వాత రంగ్‌పనీర్‌ ‌స్టేషన్‌ ‌సవి•పంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రైలు వెనుక భాగంలో ఉన్న మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ ప్రమాదంలో రెండు ప్రయాణీకుల బోగీలు, ఒక పార్శిల్‌ ‌బోగీ దెబ్బతిన్నట్లు రైల్వేశాఖ నుంచి సమాచారం అందింది. ఈ ఘటనలో మరికొంత మంది గాయపడగా, క్షతగాత్రులను హాస్పిటళ్లకు తీసుకెళ్లారు. రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించి ఎక్స్ ‌వేదికగా చేసిన ఓ పోస్ట్‌లో డార్జిలింగ్‌ ‌జిల్లాలోని ఫన్‌సిదేవా ప్రాంతంలో జరిగిన విషాద రైలు ప్రమాదం గురించి తెలుసుకుని షాక్‌ అయ్యానని తెలిపారు. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ ‌రైలు ఢీకొట్టింది.
ఈ నేపథ్యంలో  వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు రెస్క్యూ, రికవరీ, వైద్య సహాయం కోసం స్థలానికి చేరుకున్నాయని, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు.  వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించినట్లు ఎక్స్ ‌వేదికగా తెలిపారు. కాంచన్‌జంగా ఉన్న అదే ట్రాక్‌పై వెనుకనుంచి వచ్చిన ఓ గూడ్స్ ‌రైలు బలంగా ఢీ కొట్టింది. దీంతో కాంచన్‌జంగా రైలుకు చెందిన ఓ బోగీ గాల్లోకి లేచింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ ‌రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎక్స్‌ప్రెస్‌ ‌రైలు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. ఘటనాస్థలి వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు బోగీలు చూస్తే ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తుంది . ఈ ఘటనలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు.రెండు రైళ్లు ఢీ కొట్టడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రూట్‌లో వెళ్లే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. మరికొన్నింటిని రద్దు చేశారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌స్పందిస్తూ..ఎన్‌ఎఫ్‌ఆర్‌ ‌జోన్‌లో దురదృష్టకర ప్రమాదం జరిగిందన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్బ్రాంతి..మృతుల కుటుంబాలకు 2 లక్షల సాయం ప్రకటన
పశ్చిమ బెంగాల్‌లో సోమవారం ఉదయాన్నే ఘోర రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘డార్జిలింగ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో పలువురు మరణించిన వార్త బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని రాష్ట్రపతి ముర్ము ఎక్స్ ‌వైదికగా తన సందేశంలో పేర్కొన్నారు. రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సైతం విచారం వ్యక్తం చేశారు. ‘బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదం బాధాకరం. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ ‌చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50వేలు ఇస్తామని పీఎంఓ తెలిపింది.
రైలు ప్రమాదంపై సిఆర్‌ఎస్‌ ‌విచారణ
రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌వెల్లడి
ఘటనా స్థలికి బైకుపై చ్చిన మంత్రి

కోల్‌కతా, జూన్‌ 17 :‌పశ్చిమ బెంగాల్‌లోని రంగపానిలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదానికి కారణాలపై రైల్వే భద్రత కమిషనర్‌ (‌సిఆర్‌ఎస్‌) ‌దర్యాప్తు ప్రారంభించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌వెల్లడించారు. రంగపాని స్టేషన్‌లో కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ను ఒక గూడ్స్ ‌రైలు వెనుక నుంచి ఢీకొన్న సంగతి విధితమే. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించేందుకు చర్యలు తీసుకోగలమని మంత్రి తెలిపారు. తక్కిన దేశంతో ఈశాన్య భారతాన్ని అనుసంధానించే ఈ కీలక మార్గంలో రైలు సర్వీసుల పునరుద్ధరణకు రైల్వేలు అగ్ర ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన ఉద్ఘాటించారు. సిలిగురిలోని న్యూ జల్పాయిగురి స్టేషన్‌ ‌సవి•పంలోని రంగపానిలో ప్రమాద స్థలంలో విలేకరులతో వైష్ణవ్‌ ‌మాట్లాడుతూ, ‘ప్రమాదంపై రైల్వే భద్రత కమిషనర్‌ ‌సమగ్ర దర్యాప్తు జరుపుతారు’ అని చెప్పారు. రక్షణ, సహాయ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని మంత్రి ధ్రువీకరించారు.
ప్రమాద ఘటన సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ‌ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి బైక్‌పై ఘటనా స్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సవి•క్షించిన వెంటనే నేరుగా క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న హాస్పిటల్‌కి వెళ్లి బాధితులను పరామర్శించారు. రైలు ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని ఈ సందర్భంగా వి•డియా మాట్లాడుతూ అశ్వినీ వైష్ణవ్‌ ‌చెప్పారు. ‘రెస్క్యూ ఆపరేషన్‌ ‌పూర్తయింది. రెస్టొరేషన్‌ ‌పనిపై దృష్టి సారించాం‘ అని తెలిపారు. ప్రమాద ఘటనపై విపక్షాల విమర్శలపై అడిగినప్పుడు..ఇది రాజకీయాలకు సమయం కాదని సున్నితంగా వారించారు. కాగా, రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారిలో గూడ్స్ ‌రైలు లోకోపైలట్‌, ఎక్స్‌ప్రెస్‌ ‌రైలు గార్డ్‌తో సహా ముగ్గురు రైల్వే ఉద్యోగులు కూడా ఉన్నారని అధికారులు ధ్రువీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *