హరీష్ ప్రోద్బలంతోనే సిఎంతో ఎమ్మెల్యేల భేటీ
బిజెపి నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 24 : మెదక్ ఎంపీ సీటుకోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ నుంచి పోటీకి ఎమ్మెల్సీ కవిత పట్టుబడుతోందని అందుకే హరీష్ రావు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు. మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి వద్దకు పంపించింది కూడా హరీష్ రావేనని అన్నారు. మెదక్ జిల్లాలో గెలుస్తామన్న భరోసాతోనే కవిత పట్టుదలతో ఉందని, దీనిని హరీష్ రావు వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు హరీష్ రావుకు తెలియకుండానే సీఎంను కలిశారా అని రఘునందన్ ప్రశ్నించారు. వాళ్ళతో బలవంతంగా ప్రెస్ విూట్ పెట్టించారని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు త్వరలో మొత్తం కాంగ్రెస్‌లో చేరుతారని.. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్ జీరో అవుతుందని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా బీఆర్‌ఎస్ పార్టీ నేతలకు జ్ఞానం రాలేదన్నారు. పార్టీ విూద పెత్తనం కోసం ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు జరుపుతున్నారని విమర్శించారు.





