తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య అని జాతీయ బిసి సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ అన్నారు బుధవారం పార్లమెంటు రాజ్యసభ సభ్యులు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జన్మదినాన్ని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని బిసి బాలికల హాస్టల్ లో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య గత 50 సంవత్సరాల నుండి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకై నిరంతరం పోరాటాలు చేస్తూ ఎన్నో విజయాలు సాధించారని దేశ చరిత్రలోనే బహుజనుల కొరకు పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని అంతటి మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు వేడుకలు విద్యార్థుల మధ్యల జరుపుకుంటున్న అందుకు ఎంతో ఆనందంగా ఉందని ఈరోజు సంక్షేమ హాస్టల్ లు గురుకుల పాఠశాలలో సన్న బియ్యం పెట్టియడంలో ఆర్ కృష్ణ అన్న పాత్ర కీలకమని అదేవిధంగా చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కావాలని నిరంతరం పోరాడుతున్న వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని అన్నారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల తో జీవించాలని మనస్ఫూర్తిగా యావత్ బీసీ సమాజం కోరుకుంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సుందరమ్మ బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి ప్రధాన కార్యదర్శి అనిత ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి బీసీ సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్ బీసీ యువ నాయకులు రాము ముదిరాజ్ జుంటుపల్లి వెంకట్ సాయి తాండ్ర నరేష్ పరమేష్ మథిన్ రాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నా.




