ఫిబ్రవరి 15న సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 185వ జయంతి
బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజును లంబాడీలు ఆరాధ్య దేవుడిగా పూజించి కొలుస్తున్నారు.
బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన ఒక విప్లవ చైతన్య మూర్తి, గిరిజనులకు ఆదర్శప్రాయుడు సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్. విశ్వవ్యాప్త బంజారాల దేవుడు, ఆరాధ్యదైవం లిపి లేని భాష కలిగిన జాతికి వేగుచుక్కల ప్రకాశిస్తూ, యావత్ దేశంలోని సుమారు 13 కోట్ల జనాభా లంబాడీ ప్రజలు ఎక్కడైనా ఒకే రకంగా మాట్లాడుకునే తమదైన ప్రత్యేక భాషకు నిరక్షరాస్యులైన స్థిర నివాసం లేకుండా నాగరిక ప్రపంచానికి దూరమై తమ విశిష్టమైన కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, విలక్షణమైన దుస్తులు, ఆభరణాలతో సాతి భవాని పూజ విధానాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే బంజారాల జాతి యుగ పురుషుడు సామాజిక సంస్కర్తగా, దార్శనికుడు గా జన్మించిన మహనీయుడు సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బ్రహ్మచర్య దీక్షతో శాఖహారి గా సాధు జీవితం గడుపుతూ బంజారాలకు హిందూ ధర్మాన్ని బోధిస్తూ వారిని అహింసా వాదులుగా తీర్చిదిద్ది ఆదర్శవంతమైన తాత్త్విక సంఘ సంస్కర్త ఆధ్యాత్మిక గురువు సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్. బంజారాల జీవితాల్లో సుఖసంతోషాలు నింపేందుకు కృషి చేశారు. ఆయనను గిరిజనులు ఆదర్శంగా తీసుకోవాలి.
రాంజీ నాయక్ కు ముగ్గురు కుమారులు కాగా పెద్ద కుమారుడు భీమా నాయక్ కు కర్ణాటకలోని ధర్మిణి బాయితో వివాహం జరిగింది. కారణజన్ముడు రామవత్ భీమా నాయక్, దర్మిణి బాయి లకు సంతానం లేకపోవడంతో తమ కుల దైవం అయిన సప్తమాతృకలు తోల్జభవాని, మంత్రాల భవాని, సీత్లా భవాని, హీంగాలి భవాని, డొలంగార్ భవాని, దండి భవాని, మేరామా యాడీలకు ప్రత్యేక పూజలు చేసి సంతానం ఇవ్వమని కోరుకున్నారు. ఆ క్రమంలోనే ఏడుగురు దేవతల్లో మేరామ యాడిపై నమ్మకంతో 1739 ఫిబ్రవరి 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతరం జిల్లా రాంజీ నాయక్ తండాలో భీమా నాయక్, దర్మిణి భాయి దంపతులకు సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మించాడు. సేవాలాల్ మొదటి సంతానంగా ఆ తర్వాత మరో ముగ్గురు హపా, బద్దు, పూర కుమారులు జన్మించారు. ఈ క్రమంలో కుటుంబం పలు ప్రాంతాలకు సైన్యంతో పాటు వెళ్ళేది. బళ్లారి లోని గుత్తి (ఆంధ్రప్రదేశ్), సూర్ఖండ్ (ఓడిశా), నిమగావ్ (నిజామాబాద్), హైదరాబాద్ తదితర రాజ్యాలు తిరిగారు. చివరికి మహారాష్ట్రలోని రాయిగడ్ ప్రాంతం చేరే నాటికి శ్రీ సంత్ సేవాలాల్ కు 12 ఏళ్ళు నిండాయి. ఇచ్చిన మాట ప్రకారం సేవాలాల్ ను మేరమ్మ దేవతకు ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఇష్టపడలేదు. ఒకరోజు మేరమ్మ ప్రత్యక్షమై భీమా నాయక్ ను షరతులు గుర్తు చేసింది. శ్రీ సంత్ సేవాలాల్ ను నువ్వే ఒప్పించాలని ఆయన మేరామ్మ ను కోరాడు. ఒకరోజు మేరామా శ్రీ సంత్ సేవాలాల్ కలలో కనిపించి భక్తుడిగా మారాలని పోయింది. కేవలం భక్తితో మాత్రమే పూజిస్తాడు. కాలా క్రమేనా సేవాలాల్ మహారాజ్ గిరిజన తండాలలో మంచి పేరు సంపాదించాడు. అందుకే శ్రీ సంత్ సేవాలాల్ ఎవరిని పెళ్లి చేసుకోనని , లంబాడీ యువతులు’ పెద్దన్న’ గా భావిస్తున్నారు.
ఓ కరువుతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న బంజారా జాతికి ధైర్యం, భరోసానిచ్చి భవిష్యత్తుకు బాట వేసిన వ్యక్తి సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్. బంజారా జాతిలో ప్రధానంగా ఉన్న మూఢ నమ్మకాలను ఆయన పోగొట్టాడు. బంజారాలు ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ వారు చూపిన మార్గంలో బంజారాలు పయనిస్తున్నారు. సేవాలాల్ చిన్నతనం నుంచే ఆయనలో సేవగుణం ఉండేది. గోర్ బంజారాల కారణజన్ముడు శ్రీ సంత్ సేవాలాల్. యుక్త వయసులో సేవాలాల్ రాజస్థాన్లోని మాలువ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలా దక్షిణ భారతదేశం వరకు గోర్ బంజారాలు పశువులను మేపుకుంటూ వలసలు వెళ్లారు. తల్లి కట్టి ఇచ్చిన సద్దిని అనార్తులకు దానం చేసి ఆవుల వెంట అడవుల్లోకి పోయేవారు. అమ్మవారు సేవాలాల్ శిరస్సును తిరిగి అతని శరీరానికి జోడించి జీవం పోస్తుంది. సేవాలాల్ మహారాజ్ లంబాడీ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. అప్పటి నుంచి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలిగా, గురువుగా స్వీకరించి అన్ని విద్యలను నేర్చుకొని బంజారా సేవల్లో అందరూ నిమగ్నమయ్యారు. ఆర్థిక సంస్కరణలు, మతమార్పిడులు, అరికట్టడం ధర్మాన్ని రక్షించడం కోసం ఉద్యమాలు మొదలైనవి. అహింస పాపమని, మత్తు, దూమ పానం, మద్యం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శ ఆదర్శ ప్రాయంగా నిలిచారు. సేవాలాల్ మహారాజ్ ఆనాడు బంజారా జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు. ఈ పరిస్థితుల్లో గిరిజన జాతిని సన్మార్గంలో నడిపించేందుకు సేవాలాల్ మహారాజ్ అవతరించాడు. ఆమె వెంటనే సేవాలాల్ శరీరంపై పడి ఏడవడంతో 1806 ఏప్రిల్ 12న మహారాష్ట్రలోని పౌరగడ్ లో తుదిశ్వాస విడిచినట్లు ఆధారాల ద్వారా తెలిసింది. అప్పటి నుంచి మహారాష్ట్రలోని పౌరగఢ్ గుత్తిలో నిత్యం సందర్శకులతో కళకళలాడుతుంది.
శ్రీ సంత్ సేవాలాల్ జయంతిని లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలతో ఘనంగా నిర్వహీస్తారు. సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని సేవాలాల్ కు కడా వో ( బెల్లంతో చేసిన ప్రసాదం ) నైవేద్యం తోటి బంజారాలకు పంచి పెడతారు. భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించిన అనంతరం భక్తులతో పాటు, తండా వాసులకు అన్నదానం చేస్తారు. వేడుకల్లో భాగంగా మహిళలు లంబాడ వేషధారణతో నృత్యాలు, పురుషులు దాండీయా ఆటలు ఆడుతూ ఉత్సాహంగా జయంతి వేడుకలు జరుపుకుంటారు. నిజమైన సమాజానికి సేవకుడు అయిన ఇతని నాయకత్వంలో ప్రయణించండి అని జగదాంబ ఆశీర్వదిస్తుంది. సేవాలాల్ తో పాటు ఆ ఆహారం తిన్న బంజారాలకు ఎలాంటి హాని కలగకపోడవంతో సేవాలాల్ శక్తిని తెలుసుకున్న నిజాం నవాబు హైద్రాబాద్ లో ఉన్న మహరాజ్ఘంజ్, బంజారాహిల్స్ ప్రాంతాలను బహుమానంగా ఇచ్చారని బంజారా పెద్దలు చెబుతారు. అక్కడి నుంచి పౌరఘడ్ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పచుకొని బంజారాలను సంస్కరించే బోధనలు కొనసాగించారు. బంజారాలకి దశ-దిశ చూపి వారి ఆచారాలు, వ్యవహారాలు, గొప్పతనం, విశిష్టతలను తెలియజేయడానికి సేవాలాల్ మహారాజ్ జన్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. గిరిజన ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జీవితం బంజారాలుకే కాక యావత్ సమాజానికి ఆదర్శప్రాయం. కాబట్టి సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. రాష్ట్రంలోని జిల్లా కేంద్రంతో పాటు ప్రతి మండలాల్లో, తండాలలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా బంజారాలు సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ బోగ్ భండార్ పండుగ చేసుకోని వారి ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.
లకావత్ చిరంజీవి నాయక్,
వరంగల్, 99630 40960.





