బంగారు తెలంగాణ పేరు తో ప్రకృతి విధ్వంసం .

-తెలంగాణతో పాటు ప్రకృతిని నాశనం చేసే మాఫియా ఏర్పడింది
-ప్రకృతి విధ్వంసం వల్ల భూమి మనుగడకే ముప్పు వాటిల్లింది
-తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ఆవిర్భావ సభలో వక్తలు
ఖైరతాబాద్, ప్రజాతంత్ర విలేఖరి, జూన్ 05 :
బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణలో ప్రకృతి విధ్వంసం జరుగుతుందని పలువురు వక్తలు అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం చేయొద్దని వారు సూచించారు. ఈ మేరకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఆదివారం తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ఆవిర్భావ సభ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు దేవయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి వేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తం, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ప్రొఫెసర్ సురేపల్లి సుజాత, డాక్టర్ దొంతి నర్సింహా రెడ్డి, డాక్టర్ బివి.సుబ్బారావులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం రోజు రోజుకు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రకృతిని నాశనం చేసే మాఫియా వచ్చిందన్నారు. భూమి మనుగడకే ముప్పు వాటిల్లిందని, మానవ మనుగడ ఉన్న ఏకైక గ్రహం భూ గ్రహం అని భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా పరిశ్రమల కారణంగా భూమి కలుషితం అవుతుందన్నారు. ప్రకృతి వనరుల విధ్వంసం వలన ప్రతీ యేటా ఉష్నోగ్రతలు పెరుగుతూ పోతున్నాయని అన్నారు. రానున్న 8 ఏళ్లలో ఉష్ణోగ్రతలు 60 డిగ్రీలకు పెరిగినా అశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నరు. తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ఏర్పాటు చేయడం హర్షనీయం అని, సమితికి తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సమితి నూతన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు దేవయ్య, ఉపాధ్యక్షులు పులి రాంబాబు గౌడ్, ప్రధాన కార్యదర్శి చందనగిరి గోపాల్, సంయుక్త కార్యదర్శి భోగం శ్రీనివాస్, కోశాధికారి వాసం మల్లేష్ యాదవ్, రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు గూడెల్లి గౌరీశంకర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *