ప్రజావాణికి పోటెత్తిన జనం…ఆర్జీల స్వీకరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం విశేష సంఖ్యలో జనం పోటెత్తుతున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక శుక్రవారం మహాత్మా జ్యోతి బా పూలే ప్రజాభవన్‌ నందు నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వొచ్చిన అర్జిదారులతో ప్రజావాణి నోడల్‌ అధికారి హరిచందన మాట్లాడారు. అర్జిదారుల సమస్యలను తెలుసుకుని, దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వొచ్చి, పరిష్కరించనున్నట్లు అర్జీదారులకు ఆమె వివరించారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా అర్జీదారుల నుండి అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ ప్రజావాణి నిర్వహణను సమన్వయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *