పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

  • కార్మికుల డిమాండ్లనను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
  • జాతీయ బిసి సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి

తాండూరు, ప్రజాతంత్ర, జూలై 14: పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు. గత తొమ్మిది రోజులుగా 20 డిమాండ్లతో కూడిన పంచాయతీ కార్మికుల తాండూరు మండల పరిషత్ ఆవరణంలో చేపట్టిన సమ్మెకు శుక్రవారం తాండూర్ నియోజవర్గ బీసీ సంఘం నాయకులు పాల్గొని కార్మికులకు సంపూర్ణంగా మద్దతు పలికారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కార్మికులు బతుకులు బాగుపడతాయని ఎంతో ఆశపడ్డారని అందుకు విరుద్ధంగా ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా ఉంటుందని గత తొమ్మిది రోజులుగా పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీసీ సంఘం పూర్తిగా అండగా ఉంటుందని వారి న్యాయమైన 20 డిమాండ్లు నెరవేరేవరకు తోడుంటామని కార్మికులకు బీసీ సంఘం నాయకులు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బుగ్గప్ప రాష్ట్ర బీసీ కార్యదర్శి సయ్యద్ సుకుర్ బీసీ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ యువజన సంఘం నాయకులు బసవరాజ్ నరేష్ అశోక్ కృష్ణ రామకృష్ణ సురేందర్ మరియు కార్మికులు జైరామ్ నర్సింలు సాబిర్ సాయప రాజ్కుమార్ జీలని శామప్ప ఎస్ వెంకటేష్ అనంతయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *