నిజామాబాద్‌ ‌దవాఖాన అద్భుత ఘనత

  • 24 గంటల్లో పది మోకాలు మార్పిడి చికిత్సలు
  • అభినందించిన మంత్రి హరీష్‌ ‌రావు

నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌20: ‌నిజా మాబాద్‌ ‌జిల్లా ప్రభుత్వ జనరల్‌ ‌దవాఖాన  అరుదైన మైలురాయి అందుకుంది. 24 గంటల్లోనే 10 మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి రికార్డు సృష్టించింది. దాదాపు రూ. 4 లక్షల వరకు ఖర్చు అయ్యే శస్త్ర చికిత్సలను పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చేసినట్లు హాస్పిటల్‌  ‌వైద్య బృందం తెలిపింది.ఈ సందర్భంగా హాస్పిటల్‌  ‌సూపరి ంటెండెంట్‌ ‌డాక్టర్‌ ‌ప్రతిమారాజ్‌ ‌డియాతో మాట్లాడుతూ.. ఈ నెల 19వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో(సరిగ్గా 24 గంటలు) 10 మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతం చేశామని తెలిపారు.

ఇది ఒక అరుదైన ఘనతగా భావిస్తున్నామని చెప్పారు. గతంలో ప్రభుత్వ దవాఖాన ల్లో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు జరగలేదు. గత మూడు నెలల నుంచి ఈ సర్జరీలు చేయడం ప్రారంభించాం. మే నెలలో ఆరు సర్జరీలతో ప్రారంభించామని తెలిపారు. అలా ఇవాళ 24 గంటల్లో పది సర్జరీలను విజయవంతంగా చేశామంటే మా డాక్టర్లు, నర్సింగ్‌ ‌సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని డాక్టర్‌ ‌ప్రతిమారాజ్‌ ‌పేర్కొన్నారు.

ఒకే రోజు రికార్డు స్థాయిలో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలను దిగ్విజయంగా పూర్తి చేసిన నిజామాబాద్‌ ‌జిల్లా దవాఖాన వైద్య బృందాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ప్రపంచ కీళ్ల నొప్పుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఘనత సాధించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ ‌మార్గదర్శకత్వంలో ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *