‘ఛలో దిల్లీ’ నిరసనల్లో గుండెపోటుతో రైతు మృతి
న్యూదిల్లీ, ఫిబ్రవరి 16 : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ రైతులు దిల్లీ చలో కార్యక్రమంతో నిరసనకు దిల్లీ బాటపట్టిన విషయం తెలిసిందే. ఆందోళనకు మద్దతుగా శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా.. గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ పిలుపుకు పలు పార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నిరసనలో పాల్గొన్న వృద్ధ రైతు గుండెపోటుతో మరణించాడు. పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభులో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అన్నదాతలు అక్కడకి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఓ వృద్ద రైతు(78)కు గుండెపోటు రావడంతో.. 4 గంటల సమయంలో రాజ్‌పురాలోని ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు.
అక్కడి నుంచి పాటియాలాలోని ప్రభుత్వ రాజింద్ర హాస్పిటల్‌కి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స చేస్తుండగా రైతు మరణించాడు. మృతుడు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన జ్ఞాన్ సింగ్‌గా గుర్తించారు. ఇప్పుడే కాడు అంతకు మందు నిరసనలో కూడా కొందరు రైతులు మరణించారు. మరోవైపు చండీగఢ్‌లో కేంద్ర మంత్రులు.. రైతు సంఘూల నేతలతో మూడు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు ఫలించలేదు. హర్యానాలో రైతు సంఘాల నేతలు పోలీసుల ఆక్షంలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఎస్‌పీకి చట్టపరంగా హామీ, ఇతర డిమాండ్లపై చర్చించారు. రైతుల డిమాండ్లపై ఆదివారం సాయంత్రం మరోసారి చర్చలు జరుగనున్నాయి.




