ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : దేశ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ త్యాగమూర్తులను దేశ ప్రజలు ఎన్నటికి మరువరని వారు చూపిన బాటను నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని దేశ ఐక్యతకు, అభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు కాశమని శ్యామ్ రావు ముదిరాజ్ అన్నారు. లాల్ దర్వాజా మొడ్ నెహ్రు విగ్రహం దగ్గర సంఘమిత్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నేడు దేశ భక్తులందరికీ సంస్కరణ దినమని వారి త్యాగాల వల్లే ఈరోజు మనం స్వేచ్ఛ ఫలాలను అనుభవించడం సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్, ఎస్. మన్సబ్దార్, పిఎస్ నారాయణ, నీరజ్ సక్సేనా, హెచ్.ప్రణవ్, సంతోష్ కుమార్, ప్రసాద్ రావు, రాందాస్ తదితరులు ప్రసంగించారు. అనంతరం మిఠాయిలు అరటి పండ్లు పంచిపెట్టారు.




