టిడిపి అధినేత చంద్రబాబుపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబుపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని యాలాల టిడిపి అధ్యక్షులు ఎర్ర హనుమంతు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటూ ప్రజలకు సేవలు అందించిన మహానేత నారా చంద్రబాబునాయుడు అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేసి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ఘనత ఆయనదేనా అని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అవినీతికి అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీగా పరిపాలన అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు ప్రస్తుతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న అందుకే ఆయనపై కక్షపూరితంగా అక్రమ కేసులను పెట్టి జైలుకు పంపించారని వ్యక్తం చేశారు జగన్ లాంటి అవినీతిపరుడు కాడని అందుకే జగన్ జైలు పాలు అయినందుకే చంద్రబాబుని సైతం ఏదో సాకుతో జైలుకు పంపాడని అన్నారు. నిర్దోషిగా వచ్చి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా మరోసారి ఎన్నికై ప్రజలకు సేవ చేస్తాడని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబం ఆధర్య పడకుండా ధైర్యంగా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *