గోదావరి నదిలో యువకుడు గల్లంతు

పినపాక, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలోని రావిగూడెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల సురేష్ అనే యువకుడు రావిగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నదిలో సోమవారం ఉదయం గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రావిగూడెం గ్రామానికి చెందిన స్థానికులు బతుకమ్మలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు సమీపంలోని గోదావరి నదికి వెల్లగా గ్రామానికి చెందిన చిట్టిమల్ల సురేష్ అనే యువకుడు గోదావరి లోతును పరిశీలించేందుకు నదిలోకి దిగగా వరద ప్రవాహానికి గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఏడూళ్ళ బయ్యారం సిఐ శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్తుల సహకారం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *