గాజాలో పిల్లల పరిస్థితి ఘోరం

కుటుంబాలకు నగదును అందిస్తుంది. కొన్ని ఆశ్రయాలలో ప్రాథమిక మానసిక ఆరోగ్యం మరియు మానసిక సామాజిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది.

యూనిసెఫ్‌ పిలుపు : పాలస్తీనాలోని పిల్లల పరిస్థితికి ప్రతిస్పందించడానికి యునిసెఫ్‌ పిలుపునిస్తోంది. తక్షణ మరియు దీర్ఘకాలిక మానవతావాద కాల్పుల విరమణ ప్రకటించాలి. అపహరణకు గురైన పిల్లలందరినీ తక్షణం షరతులు లేకుండా విడుదల చేయాలి. పిల్లలను చంపడం లేదా వైకల్యం కలిగిన పిల్లలందరిపై ఏదైనా తీవ్రమైన ఉల్లంఘనలకు ముగింపు పలకాలి. గాజాలో పిల్లలు అత్యవసర వైద్య కేసులను సురక్షితంగా క్లిష్టమైన ఆరోగ్యసేవలను పొందడం కోసం అవకాశం కలిగించాలి.

ఉత్తరాదితో సహా గాజా స్ట్రిప్‌కి మరియు లోపల ప్రభావితమైన జనాభా ఎక్కడ ఉన్నా వారిని చేరుకోవడానికి నియంత్రణలు ఉండకూడదు. అత్యవసర వాణిజ్య సామగ్రి ఇంధనం సురక్షితమైన తరలింపునకు అన్ని మార్గాలు తెరిచి ఉంచాలి. ప్రతిస్పందన ప్రయత్నాలను సమన్వయం చేయడానికి విశ్వసనీయ టెలికమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌లను అందుబాటులో ఉంచాలి. ఆశ్రయాలు మరియు పాఠశాలలుకు, ఆసుపత్రులకు విద్యుత్‌, నీరు, పారిశుధ్యం మరియు టెలికమ్యూనికేషన్‌ సౌకర్యాల వంటి పౌర మౌలిక సదుపాయాలు కల్పించాలి. పౌరులు మరియు పిల్లల ప్రాణాలను కోల్పోకుండా, వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి, అనారోగ్యంతో ఉన్నవారికి, గాయపడిన వారికి సంరక్షణ అందించడానికి సంఘర్షణకు సంబంధించిన అన్ని పక్షాలు అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించాలి. ఇవన్నీ జరగాలని యునిసెఫ్‌ కోరుతుంది.

-డి.జె మోహనరావు, అధ్యాపకుడు, శ్రీకాకుళం

ఆంధ్రప్రదేశ్‌, 9440485824

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *