పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 22: ఇటీవల జరిగిన 67వ తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో అండర్ 14 బ్యాడ్మింటన్ విభాగంలో బంగారు పతకం సాధించిన పటాన్ చెరు పట్టణానికి చెందిన హర్ష, నర్రా శబరీష్ లను
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని అభిలాషించారు. సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్రా బిక్షపతి పాల్గొన్నారు.





