కౌంట్‌ డౌన్‌..05 ప్రజా‘తంత్రం’

ఎవరి పథకాల్లో ఏముంది ఘనం?
ఉచితాలకి రాసిస్తారు హామీపత్రం!
ఎంతకాలం చేస్తారు ఈ పందేరం?
ఖజానాపై పడుతోంది పెనుభారం!

సంక్షేమ పథానికి మారిందా అర్ధం?
అప్పుల కోసం బిక్షమెత్తడం నిజం!
ప్రణాళికలకి ఎక్కడుంది ప్రమాణం?
శాస్త్రీయ దృక్పథమే రక్షణమంత్రం!
– వి.రమేష్‌ బాబు

దేశ ప్రధాని, బీజేపీ అగ్రనాయకుడు నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా   ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,  ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌  బీజేపీ తరఫు అభ్యర్థుల కోసం పలు నియోజక వర్గాల్లో బహిరంగ సభలు, రోడ్‌ షో లు నిర్వహించారు. తమ పార్టీ అధికారంలోకి వొస్తే బీసీ ని ముఖ్యమంత్రిని చేస్తామని, అవినీతి కి పాల్పడ్డ బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం పై కఠిన చర్యలతో పాటు జైలుకు పంపిస్తామని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ ఆదిలాబాద్‌,వేములవాడ నియోజక వర్గ విజయభేరీ సభల్లో పాల్గొన్నారు. ‘హమ్‌ యార్‌ ..మోదీ ,కేసీ ఆర్‌ ..’’ అంటూ బీఆర్‌ ఎస్‌, బీజేపీ లు ఒకటే అని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక వాద్రా ఖమ్మం, మధిర బహిరంగ సభల్లో మహిళల కష్టాలు కేసీఆర్‌ పాలనలో ఎక్కువ అయినాయని .. తమ పార్టీ అధికారం లోకి వొస్తే మహిళకు ప్రాధాన్యత లభిస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ లో  బీఆర్‌ ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు బహిరంగ సభ వాతావరణం సరిగా లేక రద్దయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *